మన ఇండియాకు అత్యంత సుదీర్ఘమైన సముద్ర తీరం ఉంది. అటు గుజరాత్ నుంచి కన్యాకుమారి మీదుగా ఇటు పశ్చిమ బెంగాల్ దాకా ఎన్నో రాష్ట్రాల మీదుగా సముద్ర తీరం సాగుతుంది. ఈ క్రమంలో వందలాది బీచ్ లు ఉన్నాయి. అందులో పరిశుభ్రంగా ఉండే బీచ్ లు ఏవో తెలుసా? టైమ్స్ సంస్థ పరిశీలన ప్రకారం.. అందమైన, శుభ్రమైన టాప్ బీచ్ లు ఇవే..
గుజరాత్ లోని శివరాజ్ పూర్ బీచ్
గుజరాత్ లోని ద్వారకలో ఈ బీచ్ ఉంది. ఇక్కడ సముద్రపు నీరు క్లియర్ గా ఉంటుంది. ఇది అత్యంత పరిశుభ్రంగా ఉండటంతో.. ‘బ్లూ ఫ్లాగ్’ బీచ్ గా గుర్తింపు కూడా పొందింది.
కర్ణాటకలోని పదుబిద్రి బీచ్
పరిశుభ్రతకు, ప్రకృతి అందాలకు ఈ బీచ్ పెట్టింది పేరు. నీళ్లు కూడా చాలా క్లియర్ గా ఉంటాయి. సన్నని, బంగారు రంగు ఇసుక ఇక్కడి ప్రత్యేకత.
కేరళలోని కప్పాడ్ బీచ్..
ఇక్కడ కూడా సన్నని, బంగారు రంగు ఇసుక, క్లియర్ వాటర్ ప్రత్యేకతలు. బ్రిటన్ నుంచి ఇండియాకు సముద్ర మార్గం కనిపెట్టిన వాస్కోడగామా మొదట కాలు పెట్టింది ఇక్కడే.
కేరళలోని కోవలం బీచ్..
పూర్తి పరిశుభ్రతకు పెట్టింది పేరు ఈ బీచ్. ప్లస్ ఆకారంలోని ఈ బీచ్.. క్లియర్ వాటర్ తో ఆకట్టుకుంటూ ఉంటుంది.
పుదుచ్చేరిలోని ఈడెన్ బీచ్..
పుదుచ్చేరిలోని చిన్నవీరంపట్టినంలో ఉన్న ఈడెన్ బీచ్ కూడా ప్రశాంత వాతావరణానికి, శుభ్రతకు పెట్టింది పేరు. బీచ్ నిర్వహణ చాలా బాగుంటుంది.
అండమాన్ లోని రాధానగర్ బీచ్
అండమాన్ నికోబార్ దీవుల్లోని స్వరాజ్ ద్వీపంలో ఉన్న రాధానగర్ బీచ్ ప్రకృతి రమణీయతకు, శుభ్రతకు ఫేమస్. ఇక్కడి సన్నని, తెల్లని ఇసుక, చాలా క్లియర్ గా ఉండే నీళ్లు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.
ఒడిశాలోని గోల్డెన్ బీచ్
ఒడిశాలోని పూరీలో ఉన్న గోల్డెన్ బీచ్ కూడా ప్రకృతి అందాలకు పేరు పొందింది. స్థానిక ప్రభుత్వాల చొరవతో పరిశుభ్రంగా ఉంటుంది. బంగారు రంగు ఇసుక, క్లీన్ వాటర్ కూడా బాగుంటాయి.
ఆంధ్రప్రదేశ్ లోని రుషికొండ బీచ్
విశాఖపట్నంలోని రుషికొండ బీచ్ కూడా క్లియర్ వాటర్ తో శుభ్రంగా ఉంటుంది. ఇక్కడికి స్థానికులు, పర్యాటకులు తరచూ వస్తుంటారు.