A place where you need to follow for what happening in world cup

ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటుతూ తమ ఇంటిపై జాతీయ జెండా ఉంచాలి

  • జాతీయ జెండా తిరంగా ర్యాలీలో పాల్గొన్న
  • బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి

ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటుతూ తమ ఇంటిపై నేడు జాతీయ జెండా ను ఉంచాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి పిలుపునిచ్చారు.సోమవారం అజాది కా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మన ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ  పిలుపు మేరకు ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు ఇంటింటికి జాతీయ జెండా కార్యక్రమంలో భాగంగా బిజెపి పార్టీ మండల శాఖ, పట్టణ శాఖ  ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగా  ర్యాలీ లో చంద్రుపట్ల సునీల్ రెడ్డి  పాల్గొన్నారు.  ఈ ర్యాలీ మంథని రాం రెడ్డి కాంప్లెక్స్ నుండి మంథని పురా విధులగుండ  కృష్ణవేణి, కాకతీయ, అలోక్ పాఠశాలల విద్యార్థులు, బీజేపీ నాయకులతో కలిసి 200 మీటర్ల జాతీయ జెండాతో తిరంగా భారీ  ర్యాలీ  నిర్వహించారు. భారత్ మాత కి జై,వందేమాతరం నినాదాలతో మంథని పట్టణం  అంత మార్మోగింది, అనంతరం బిజెపి రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి  మాట్లాడుతు దేశ ప్రజలలో దేశ భక్తిని మరింత పెంపొందించడానికి  తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు, ప్రపంచంలో మన దేశం అగ్రగామిగా  దినదినం  అభివృద్ధి చెందుతుందని,  నేడు ప్రపంచ దేశాలకు భారతదేశం ఒక మార్గదర్శకంగా  మన ప్రధాని నరేంద్ర మోడీ  చేస్తున్నారన్నారు, నేషన్ ఫస్ట్ ఫ్యామిలీ నెక్స్ట్ అనే నినాదం తో  ముందుకు సాగుదామని అన్నారు.

ప్రపంచంలోనే మన దేశానికి గొప్ప చరిత్ర ఉందని మన దేశాన్ని విశ్వ గురువుగా చేయడానికి ప్రధాని మోదీ  అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు.ప్రపంచ దేశాల అన్నిటికి మన దేశ ఔన్నత్యాన్ని చాటే విధంగా ప్రపంచంలోనే అతి ఎత్తైన విగ్రహంగా స్వరాజ్యమే నా జన్మ హక్కు అని చాటి చెప్పిన మన భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్  ఐక్యత ప్రతిమ విగ్రహాన్ని స్థాపించి దేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు  తెలియజేశారని పేర్కొన్నారు.

కరోనా మహమ్మరి కాలంలో మన దేశ ప్రజలనే కాకుండా ప్రపంచ దేశాలకు టీకాలు అందించి ఎంతోమంది ప్రాణాలను కాపాడిన ఘనత కూడా మన దేశానికి దక్కిందని అధికారులు, నరేంద్ర మోడీ  వల్లనే సాధ్యమైందని తెలిపారు అదేవిధంగా మన మంథని నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు తమ ఇంటిపై జాతీయ జెండా ఉంచుకొని దేశభక్తి ని, దేశ ఔన్నత్యాన్ని కాపాడాలని కోరారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కొ కన్వీనర్ నాంపల్లి రమేష్, జిల్లా అధికార ప్రతినిధి పోతర వేణి క్రాంతి కుమార్, బి ఎస్ ఏ నియోజకవర్గం ఇంచార్జ్ చిలువరి సతీష్,మండల అధ్యక్షులు  వీరబోయిన  రాజేందర్, పట్టణ అధ్యక్షులు బూడిద తిరుపతి, సీనియర్ నాయకులు రాపర్తి సంతోష్ , కోరబోయిన మల్లిక్, ఎడ్ల సదశివ్, సబ్బాని సంతోష్,బోయిని నారాయణ, రేపక శంకర్, బుర్ర రాజు గౌడ్, షరీఫుద్దీన్, గురువేష్, కనుకుంట్ల సుధాకర్, బోసెల్లి శంకర్, దీకొండ  రవి, అలవెని సమ్మయ్య, పార్వతి విష్ణు, ఆ ఇంటి మల్లేష్, తోట నాగరాజు, ఉప్పు వరుణ్, ఇసంపల్లి  శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.