A place where you need to follow for what happening in world cup

ప్రతి విద్యార్థి ఉన్నతంగా చదువుకుని ఆకాశమే హద్దుగా ఎదుగాలే

పేద బిడ్డల చదువు ఆర్థికబారం కావద్దన్నదే మా ఆలోచన
తలరాతలు మార్చే ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలి
బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యా వైద్య రంగాలకు పెద్దపీట
జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్

ప్రతి విద్యార్థి ఉన్నతంగా చదువుకుని ఆకాశమే హద్దుగా ఎదుగాలన్నదే తమ ఆకాంక్ష అని మంథని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. సోమవారం మంథని పట్టణంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో చదుకుంటున్న విద్యార్ధులకు పుట్ట లింగమ్మ ట్రస్టు ద్వారా బస్సు పాస్లను మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజతో కలిసి పంపిణీ చేశారు.ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పేదింటి బిడ్డల చదువులు తల్లిదండ్రులకు ఆర్థికబారం కావద్దన్నదే మా ఆలోచన అన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లోని ఎంతో మంది పేద బిడ్డలు ఆర్థిక స్థోమత లేక చదువులకు దూరం అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకోవాలనే తపన, ఆరాటం, ఆకాంక్ష ఉన్నా ఆర్థిక పరిస్థితులు వారి భవిష్యత్కు అడ్డుపడుతున్నాయని, అలాంటి పరిస్థితులు ఏ బిడ్డికు రావద్దన్నది ఆలోచన చేస్తున్నామని, ఇప్పటికే ప్రభుత్వ కళాశాలల్లో చదువుకునే పేద బిడ్డల ఆకలి తీర్చేలా మధ్యాహ్న బోజనం, ట్యూషన్ ఫీజు ఇతరత్రా సేవలు అందించామని ఆయన గుర్తు చేశారు. ప్రతి విద్యార్థి ఉన్నతంగా చదువుకుని ఆకాశమే హద్దుగా ఎదుగాలన్నదే తమ ఆకాంక్ష అని, ఈ  క్రమంలో రాబోయే రోజుల్లో హైదరాబాద్లో ఉన్నత  చదువులు చదువుకునే పేద విద్యార్ధులకు హస్టల్ వసతి కల్పించే ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వివరించారు. అనేక ఏండ్లు ఈ ప్రాంతాన్ని పరిపాలన చేసిన పాలకులు ఏనాడు పేద బిడ్డల భవిష్యత్ గురించి ఆలోచన చేయలేదన్నారు.

పాలకులు ఉన్నత చదువులు చదువుకున్నా గొప్పగా ఆలోచన చేయలేదన్నారు.  గత పాలకుల స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు నేటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన మన ఊరు మన బడి కార్యక్రమంలో నిధులు కేటాయించి సున్నాలు వేసే వరకు వాళ్లు పట్టించుకోలేదని, అలాంటి దుస్థితి మన ప్రాంతంలో ఉండేదన్నారు. విద్యార్ధి దశలోనే ప్రతి విషయాన్ని అవగతం చేసుకుని చర్చించుకోవాలని, తమ తల్లిదండ్రులకు అవగాహన కల్పించి చైతన్యం తీసుకురావాలన్నారు. మన తలరాతలు మార్చేది కేవలం ఓటుహక్కు మాత్రమేనని, ఆ ఓటు హక్కును సక్రమంగా  వినియోగించుకోవడంలో ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలన్నారు. మంచి నాయకుడిని ఎన్నుకుంటే మన భవిష్యత్కు బంగారు బాటలు వేస్తారని అన్నారు. ఈ ప్రాంతానికి, ఈ మట్టి గడ్డపై పుట్టిన వారు మాత్రమే మన గురించి ఆలోచన చేస్తారని, ముత్తారం మండలానికి చెందిన ఆర్టీసీ ఉద్యోగి కేకే రెడ్డి గొప్పగా ఆలోచన చేసి పేద బిడ్డలకు బస్పాస్లు ఇప్పించాలని తనతో చెప్పారని, ఏదైనా పని చెప్పితే చేస్తారనే నమ్మకం ఉండాలని, అలాంటి నమ్మకం తనపై ఉంచడం సంతోషంగా ఉందన్నారు.

ఈ ప్రాంతానికి చెందిన కేకే రెడ్డి ఆలోచన చేసినట్లుగా గత పాలకులు ఏనాడు ఆలోచన చేయలేదని, అలా చేసి ఉంటే మన భవిష్యత్ మరోలా ఉండేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వైద్య రంగాలకు పెద్దపీట వేశారని, విద్యా వైద్య రంగాల్లో అనేక మార్పులు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. కానీ పాలకుల తీరుతోనే కొంత ఇబ్బందులు తప్పడం లేదని, అలాంటి పరిస్థితులు రాకుండా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత మీపై ఉందని ఆయన స్పష్టం చేశారు. అనంతరం విద్యార్దులకు ఉచిత బస్పాస్లను ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అరెపల్లి కుమార్, ఎంపీపీ కొండా శంకర్, మండల విద్యాధికారి దాసరి లక్ష్మి, కౌన్సిలర్లు వీకే రవి, గర్రెపల్లి సత్యనారాయణ, కుర్ర లింగయ్య నాయకులు కొట్టే రమేష్, నక్క శంకర్ లతో పాటు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.