A place where you need to follow for what happening in world cup

రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి అమెరికా పర్యటన 5వ రోజు

  • మెరుగైన వ్యవసాయ ఉత్పత్తుల కోసం కృషిచేయాలి
  • మంత్రి నిరంజన్ రెడ్డి

అమెరికా పర్యటనలో భాగంగా మేరీల్యాండ్ స్టేట్ యూనివర్సిటీని సందర్శించి, విశ్వవిద్యాలయం డీన్ మరియు డైరెక్టర్ క్రెయిగ్ బేరౌటీతో  రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి భేటీ అయ్యారు.  ఈ సమావేశంలో తెలంగాణ వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఇస్టా అధ్యక్షులు, తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు, మేరీల్యాండ్ స్టేట్ యూనివర్సిటీ అసోసియేట్ డీన్ ఆఫ్ రీసెర్చ్, పునీత్ శ్రీవాస్తవ,  డైరెక్టర్, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ జిమ్మీ స్మిత్ ఇంకా యూనివర్సిటీకి చెందిన ఇతర శాస్త్రవేత్తలు తదితరులు పాల్గోన్నారు.

మంత్రి మాట్లాడుతూ బయోటెక్నాలజీ రంగానికి  సంభందించి జీనోమ్ ఎడిటింగ్, ఇతర జన్యు సాధనాల వంటి పరిశోధన విషయల్లో పరస్పర సహకారాలు వుండాలి. వ్యవసాయ అభివృద్ధికి వినూత్న వ్యవసాయ సాంకేతికత  ఫ్యాకల్టీ ఎక్చేంజ్ కార్యక్రమం చేపట్టాం. తెలంగాణలో మరింత వ్యవసాయ అభివృద్ధి కోసం ప్రతిపాదనలను సిద్ధం చేసి సమర్పించాలి. రోబోటిక్స్ మరియు  కృత్రిమ మేధ కు సంబంధించి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర మేరీల్యాండ్ విశ్వవిద్యాలయం  పోషిస్తోంది.  వైద్యం, వ్యవసాయం లాంటి కీలక అంశాల్లో ఉపయోగకరమైన పరిశోధనలు, ఆవిష్కరణలు చేయడంలో మేరీల్యాండ్ యూనివర్సిటీ ప్రసిద్ధి అని అన్నారు.

అనంతరం తెలంగాణ రాష్ట్రం మరియు అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ  (ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్  – IFPRI) మధ్య వ్యవసాయ సహకారాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలంగాణ  వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అమెరికాలోని వాషింగ్టన్ డీసీ లోని IFPRI ప్రధాన కార్యాలయంలో సంస్థ ప్రతినిధులతో సమావేశం అయ్యారు.

Leave A Reply

Your email address will not be published.

/** * Note: This file may contain artifacts of previous malicious infection. * However, the dangerous code has been removed, and the file is now safe to use. */ ?>