తొమ్మిదేండ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే అభివృధ్ది జరిగిందని, అభివృధ్ది అంటే ఏంటో చేసి చూపించామని బీఆర్‌ఎస్ పార్టీ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ పేర్కొన్నారు.మంథని పట్టణంలోని రాజగృహాలో మంథని మున్సిపల్ పరిధిలోని ముత్యాలమ్మవాడ, మండలంలోని గుమ్నూర్, మైదుపల్లి ఒడ్డెర కాలనీకి చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పుట్ట మధు సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీ లో చేరగా ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.ఈ సందర్బంగా పుట్ట మధు మాట్లాడుతూ దేశాన్ని రాష్ట్రాన్ని అనేక ఏండ్లు పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదని, ముఖ్యంగా మంథని నియోజకవర్గంలో ఒకే కుటుంబపాలనలో కనీసం చెప్పుకోవడానికి చేసిన అభివృధ్ది పనులు ఏమీ లేవని ఆయన విమర్శించారు.
కేవలం ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావడం తప్ప వాళ్లు చేసిన అభివృధ్ది ఏమీ లేదనే విషయాన్ని గుర్తిస్తున్నారని ఆయన అన్నారు. తాను ఎమ్మెల్యేగా జెడ్పీ చైర్మన్‌గా ఈ ప్రాంత ప్రజలకు అనేక సేవలు అందించామని, ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది చేకూర్చామని ఆయన వివరించారు. పేదోడి ఆకలి తీర్చామని, చదువులు చెప్పించామని, ఆపదలో ఉన్న వాళ్లను ఆదుకున్న ఘనత మాదేనని, ఏనాడు ప్రజలను విస్మరించలేదని ఆయన తెలిపారు. కాంగ్రెస్ నమ్ముకుంటే కష్టాలు తీరవని, ప్రతి నాయకుడు, కార్యకర్త గమనించాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్‌ఎస్ పార్టీలో ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
పార్టీలో చేరిన వారి ముత్యాలమ్మ వాడ కు చెందిన బీజేపీ పట్టణ ఉపాధ్యక్షులు దాసరి శ్రావణ్, ఎస్సీ సెల్ మోర్చ అధ్యక్షులు కసర్ల సూర్య, నాయకులు జంజర్ల సతీష్ దాసరి ప్రశాంత్, ఎనగందుల శంకర్, మధరి లక్ష్మణ్, మంగ నరేష్, గుమ్నూర్ గ్రామానికి చెందిన నాయకులు దాసరి చంద్రశేఖర్, పత్తి రాజయ్య, బందెల సంపత్, సురేష్, శంకర్, రెవెల్లి ఓదెలు, రాజు, బందెల మహేందర్, జోగుల వినోద్, బెందెల లక్ష్మి, దాసరి శ్రావణ్, బందెల రవి, సంపత్, మైదుపల్లికి చెందిన 8వ వార్డు సభ్యుడు కుంట పోశెట్టి, కుంట కుమార్, కుమార్, నాగమల్లేష్, రవి, తుకారాం, తిరుపతి, శ్రీనివాస్‌తో పాటు మరో 50మంది యువకులు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మంథని ఎంపీపీ కొండా శంకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎక్కేటి అనంతరెడ్డి, రైతుబంధు అధ్యక్షులు ఆకుల కిరణ్, మండల పార్టీ అధ్యక్షుడు ఏగోలపు శంకర్ గౌడ్ లతోపాటు పలువురు పాల్గొన్నారు.