12 మంది లబ్ధిదారులకు పంపిణీ
కమాన్ పూర్:రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన గొర్రెలను గురువారం సర్పంచ్ పల్లె ప్రతిమ ఆధ్వర్యంలో ఎంపీపీ అరెళ్లి దేవక్క కొమురయ్య, జడ్పీటీసీ మ్యాదరవేన.శారదా కుమార్ అందచేసారు. గతంలో రత్నాపూర్ లో మొదటి ఫేస్ కింద 55 యూనిట్ల గొర్రెలను అందజేయడం జరిగింది. రెండవ విడతలో 72 మంది లబ్ధిదారులు ఉండగా, 43 మంది లబ్ధిదారులు రూ. 43,750/- చొప్పున డీ.డీలు చెల్లించారు. దీనిలో ప్రభుత్వం రూ. 1,31,250/- లు సబ్సిడీ క్రింద చెల్లించింది. దీనిలో ఒక్కొక్క లబ్ధిదారునికి 20 గొర్రెలు, ఒక్క పొట్టేలును అందించడం జరిగింది.
లబ్ధిదారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మాచర్ల నుండి వీటిని కొనుగోలు చేసుకొని వచ్చారు. లబ్ధిదారులు జక్కుల సదయ్య, ఉడుత సతీష్, మేకల శ్రీనివాస్, మేకల రాంచందర్ , మండల వెంకటి, మెడగొండ రవి కుమార్, కోడారి కుమార్, సల్పాల అనిల్ కుమార్, జక్కుల సతీష్, జక్కుల శ్రీనివాస్, ఎలుక నర్సయ్య, సందవెన సంతోష్ కుమార్ లకు గొర్రెలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పశు వైద్యధికారి యారవ.దుర్గ ప్రసాద్ రెడ్డి,మండల యాదవ సంఘం అధ్యక్షులు బుద్ధుల తిరుపతి, సెక్రటరీ పెండ్లి రమ్య, టీఆర్ ఎస్ అధ్యక్షుడు బత్తిని ప్రశాంత్,ఓర్రె సురేష్, ఎలుక గట్టయ్య , జక్కుల ఆశాలు, మేకల ఓదెలు,మండల శంకర్, వెటర్నరీ అసిస్టెంట్ అత్తే మల్లికార్జున్, గోపాల మిత్ర జక్కుల శ్రీనివాస్,సోమరపు కనకయ్య తదితరులు పాల్గొన్నారు.