సూపర్ స్టార్ రజనీకాంత్ లీడ్ రోల్లో తెరకెక్కిన ‘జైలర్’ మూవీ గురువారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజైంది. ఇప్పటికే ప్రీమియర్ షోస్ చూసిన ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. రమ్యకృష్ణ, శివరాజ్ కుమార్, మోహన్లాల్ లాంటి స్టార్స్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమా గురువారం థియేటర్లలో గ్రాండ్గా రిలీజైంది. ఫస్ట్ లుక్ దగ్గర నుంచి టీజర్, ట్రైలర్ ఇలా అన్ని అంశాలు ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేశాయి.
ఇప్పటికే ప్రీమియర్ షోస్ చూసిన ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇంతకీ వారు ఏమంటున్నారంటే.. ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా ఉందని అంటున్నారు. ఫస్ట్ హాఫ్లో యోగిబాబు, రజనీ కాంబోలో వచ్చే సీన్స్ను చూసి అందరూ కడుపుబ్బా నవ్వుతారని కొందరు అభిప్రాయపడగా.. ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్స్లో రజనీ ఫుల్ ఆన్ యాక్షన్ మోడ్లో ఇరుగదీశారని మరికొందరు అంటున్నారు. ఇక సెకండ్ హాఫ్లో మాత్రం కొందరు స్పెషల్ ఎంట్రీల వల్ల సినిమాకు మరిన్ని మాస్ ఎలిమెంట్స్ యాడ్ అయ్యాయని.. క్లైమాక్స్లో అసలు ట్విస్ట్ ఉందని మరో అభిమాని ట్వీట్ చేశారు. మొత్తానికి ‘ జైలర్ ‘ నిరాశపరచదని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.