పేదలకు, క్యాన్సర్ రోగులకు భోజనాల ఏర్పాటు
భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు
వరస కార్యక్రమాలతో గ్రేటర్ హైదరాబాద్ లో సమాజ్ వాదీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా నాయకులు ముందుకు సాగుతున్నారు… సమాజ్ వాదీ పార్టీలో చేరిన యువ నాయకుడు దండు బోయిన నిత్య కళ్యాణ్ యాదవ్ ఆధ్వర్యంలో వరుస కార్యక్రమాలను నిర్వహిస్తూ, పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు సాగుతున్నారు… ఓవైపు పార్టీ కార్యక్రమాలు మరోవైపు సేవ కార్యక్రమాలతో నగరంలో ప్రత్యేక గుర్తింపును సమాజ్ వాది పార్టీ నాయకుడు దండు బోయిన నిత్య కళ్యాణ్ యాదవ్ సంపాదించుకుంటున్నారు… సమాజ్ వాదీ పార్టీ అధినేత .. దివంగత మాజీ ముఖ్యమంత్రి మూలయం సింగ్ యాదవ్ 85వ జయంతి వేడుకలను గ్రేటర్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు… ములాయం సింగ్ యాదవ్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు.. పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు.. ఫుట్ పాత్ పై జీవనాన్ని కొనసాగించే పేదవారికి, క్యాన్సర్ రోగులకు, భోజనాలను ఏర్పాటు చేసి ములాయం సింగ్ యాదవ్ జన్మదిన వేడుకలను, నిత్య కళ్యాణ్, నర్సింగ్ మాదిగ లు నిర్వహించారు.. పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సారథ్యంలో దేశంలో సమాజ్వాది పార్టీ అన్ని వర్గాల ప్రజలకు సముచిత స్థానం కల్పించేలా ముందుకు సాగడం జరుగుతుందన్నారు… తెలుగు రాష్ట్రాల్లో సమాజ్వాది పార్టీని బలోపేతం చేయడం లక్ష్యంగా పలు సేవా కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని నిత్య కళ్యాణ్ తెలిపారు… మొన్ననే మహిళలకు ఉచితంగా చీరలను పచిపెట్టినట్లు తెలిపారు. రాబోవు ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాది పార్టీ విజయ డంక మోగుతుందని… ముఖ్యమంత్రి గా అఖిలేష్ యాదవ్ అవ్వడం ఖాయమని నిత్య కళ్యాణం యాదవ్ అన్నారు. తెలంగాణాలో కూడా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.