- సివిల్ సప్లై వాహనాలే ప్రధాన రవాణా సాధనాలు
- నడీ రోడ్డు పై యదేచ్చగా అక్రమ రేషన్ లోడింగ్
మహబూబాబాద్:పేదోడి పొట్ట కూటి కోసం ప్రభుత్వం కేటాయించిన రేషన్ బియ్యం అక్రమార్కులకు వరంగా మారీ కాసులు కురిపిస్తోంది. మరిపెడ మండలంలోని సివిల్ సప్లై గొదామే దందాకు కేంద్రంగా మారి పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని రాష్ట్రాలు దాటిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరిపెడ మండలం నుంచి కురవి మండల కేంద్రం గుండా కాకినాడ పోర్టుకు లారీలతో రేషన్ బియ్యం పెద్ద ఎత్తున అక్రమ రవాణ అవుతుంది.
రేషన్ షాప్ లకు బియ్యం తరలించే క్రమంలో అవసరానికి మించి సివిల్ సప్లై గోదాం నుంచి అధికారుల సహకారంతో రేషన్ దుకాణాల్లో లేవి చేసి, కోటా ప్రకారం వేయగా మిగిలిన బియ్యం బస్తాలను ఎవరికి అనుమానం రాకుండా లారీల క్యాబిన్ లలో కుక్కి..ఆ తర్వాత యదేచ్ఛగా బియ్యం బస్తాలను దందాకు వాడుకుంటున్నారు. దీనికి ఆజ్యం పోసేవిదంగా నడి రోడ్డు పై లారీలను నిలిపి రేషన్ బియ్యాన్ని విచ్చల విడిగా దందా కు తరలిస్తున్నారు దందాసురులు. ఇప్పటికైనా జిల్లా అధికారులు కళ్ళు తెరిచి రేషన్ దందాపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు…