బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టెముక్కుల సురేష్ రెడ్డి..
పెద్దపల్లి:బీజేపీ సర్కార్ తోనే పెద్దపల్లి అభివృద్ధి సాధ్యమని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టెముక్కుల సురేష్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిసిల పేరు చెప్పుకొని కొంతమంది రాజకీయ నాయకులు పబ్బం గడుపుకోవడం సిగ్గు చేటని , సిట్టింగ్, మాజీ ఎమ్మెల్యేలు వారి స్వార్థం, సొంత ప్రయోజనాల కోసమే పని చేసి, పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్దిని మరిచిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లు వేయడం, లైట్లు పెట్టడం అభివృద్ది కాదని, ప్రజల జీవితాల్లో ఆర్థిక స్వావలంభన తీసుకురావడమే అసలైన అభివృద్దని తెలిపారు. ప్రజల జీవన విధానంలో మార్పు తేలేని నాయకుల అవసరం లేదని హితవు పలికారు.
అత్యధిక రైస్ మిల్లులతో దేశంలోనే రెండవ స్థానం, ఇటుక పరిశ్రమలు, ఇసుక, మట్టి వంటి ఖనిజ సంపద విపరీతంగా ఉన్నా పెద్దపల్లిని అన్ని రంగాల్లో దోచుకోవడం జరిగిందని విమర్శించారు. ఎస్సారెస్పి డి-82, 83 కాలువ పారుతున్నా నియోజకవర్గంలోని చివరి ఆయకట్టు రైతులకు ఇప్పటికీ సాగు నీరు ఇవ్వడంలో ఘోరంగా విఫలం అయ్యారని దుయ్యబట్టారు. కార్యకర్తలను కొనడం, అమ్మడం మినహాయించి బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతలు ఒరగబెట్టినదేమీ లేదని ఎద్దేవా చేశారు. ఇసుక, మట్టి మాఫియా అంటూ ఊదరగొట్టిన ఇద్దరు నేతలు తదనంటరం ఎందుకు యూటర్న్ తీసుకున్నారని ప్రశ్నించారు.
ఇటీవల్ బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు బిసిల ఆత్మగౌరవాన్ని రేవంత్ రెడ్డికి తాకట్టు పెట్టారన్నారు. నియోజకవర్గంలో ఒకసారి డబుల్ ఇంజన్ సర్కారుకు అవకాశమి వ్వాలని ప్రజలను సురేష్ రెడ్డి కోరారు. విద్య, వైద్యం, పారిశ్రామిక విధానం అమలు చేసి ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తామ ని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బిజెపి నాయకులు మోర మనోహర్, సయ్యద్ ఫయాజ్, కందునూరి ప్రమోద్ కుమార్, ఉనుకొండ తిరుపతి, కల్వల శ్రీనివాస్ రెడ్డి, లింగంపల్లి కరుణాకర్, మోసంపల్లి శ్రీధర్, ఉనుకొండ తిరుపతి, జక్కుల శ్రీకాంత్, తూముల రవి తేజ, బాల్త ప్రశాంత్, రేండ్ల వేణు, బాలసాని వంశీ, తదితరులు పాల్గొన్నారు.