A place where you need to follow for what happening in world cup

తెలంగాణ గర్వించే గొప్ప మహానియతావాది కొండా లక్ష్మణ్‌ బాపూజీ.

  • ఆ మహనీయుని జీవితం రేపటి తరానికి ఆదర్శం.
  • త్వరలో విగ్రహం ఏర్పాటు.
  • బాపూజీ ఆశయాలకు కార్యరూపం ఇచ్చిన నేత సి.యం. కేసీఆర్సూ
  • ర్యాపేట లో ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 108 వ జయంతి వేడుకలు.

బాపూజీ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి.తెలంగాణ గర్వించే గొప్పమహానియతా వాది కొండా లక్ష్మణ్‌ బాపూజీ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకడ్ల జగదీష్ రెడ్డి కొనియాడారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీ 108 వ జయంతి సందర్భంగా ఆయనకు మంత్రి జగదీష్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. సూర్యాపేట లోని కలెక్టరేట్ సమావేశమందిరంలో అలాగే పూలే విగ్రహం వద్ద పద్మశాలి సంఘం నిర్వహించిన జయంతి వేడుకలలో లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, ఉద్యమకారుడిగా, ప్రజాస్వామికవాదిగా, పీడిత ప్రజల పక్షపాతిగా, నిబద్ధత కలిగిన గొప్ప రాజకీయ నాయకుడిగా పలు పార్శ్వాలతో కూడిన కొండా లక్ష్మణ్‌ బాపూజీ జీవితం రేపటి తరానికి ఆదర్శనీయమని అన్నారు.

అణగారిన వర్గాల హకుల సాధన కోసం, సహకార రంగాల పటిష్టత కోసం జీవితకాలం కృషి చేశారన్నారు. బహుజన నేతగా, నేతన్నలైన పద్మశాలీలను సంఘటితం చేశారని, తెలంగాణ కోసం నాడు తన మంత్రి పదవికి రాజీనామా చేసిన బాపూజీ స్ఫూర్తి మలిదశ తెలంగాణ సాధన పోరాటంలో ఇమిడి ఉన్నదని తెలిపారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి, వర్ధంతులను రాష్ట్ర ప్రభు త్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని అన్నారు. రాష్ట్ర ఉద్యానవన విశ్వవిద్యాలయానికి కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేరు పెట్టి గౌరవించుకున్నామని చెప్పారు. చేనేత రంగంలో ప్రతిభావంతులైన కళాకారులకు ఆయన పేరుతో ప్రభుత్వం అవార్డులను అందజేస్తున్నదని తెలిపారు. సబ్బం డ వర్ణాల అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తూ, కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఆశయాలకు ప్రభుత్వం కార్యరూపం ఇస్తున్నదని మంత్రి పేర్కొన్నారు.

సంచార జాతుల విద్యాభివృద్ధికి ఎన్నో గురుకులలు, కళాశాలలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యానందిస్తున్నామని, చివరి అంచున ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని , సాధించి తెచ్చుకున్న తెలంగాణలో మహనీయుల చరిత్రలను తీసి అధికారికంగా గొప్పగా జయంతులు, వర్దంతూలు చేసుకుంటున్నమని స్పష్టం చేశారు. త్వరలో స్థల పరిశీలన అనంతరం పట్టణంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమం లో ఎంపి బడుగుల లింగయ్య యాదవ్, కలెక్టర్ వెంకట్రావు, అడిషనల్ కలెక్టర్స్ ప్రియాంక, వెంకట్ రెడ్డి, జిల్లా గ్రంధాలయచైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ పేరుమాల అన్నపూర్ణ, జడ్పీటీసీ జీడీ బిక్షం, బిసి సంఘం నాయకులు, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై. వీ, వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు అప్పం శ్రీనివాస్, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.