ప్రభుత్వ ఆసుపాత్రుల్లో 76 శాతం డెలివరీలు
జరుగుతున్నాయని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. మెదక్ జిల్లా మనోహరాబాదులో నూతనంగా నిర్మించిన పీహెచ్ సీని బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ హేమలత, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఒంటేరు ప్రతాపరెడ్డి, జిల్లా కలెక్టర్ రాజర్షి షా స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ…
మనోహరాబాదులో పీహెచ్ సీ ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. మనోహరాబాద్ మండలం చేయాలని దశాబ్దాల కల ముఖ్యమంత్రి కేసీఆర్ నిజం చేశారన్నారు. మనోహరాబాద్ మండలంలో 24 గంటలు పనిచేసే పీహెచ్ సీ ప్రారంభించుకుంటున్నామన్నారు. ఉచితంగా అన్ని రకాల పరీక్షలు, వైద్య సేవలు ఇక్కడ అందుబాటులో ప్రజలకు ఉంటుందన్నారు. గర్భిణీలకు చెకప్ లు కూడా ఇక్కడ జరుగుతాయన్నారు.
కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే మనోహరాబాద్ మండలం అయ్యేదా ఇక్కడ ఇంతటి అభివృద్ధి జరిగేదా అని ప్రశ్నించారు. త్వరలో మనోహరాబాదుకు పోలీస్ స్టేషన్ మంజూరు చేస్తామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిల్లో 76 శాతం డెలివరీలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయితే కేసీఆర్ కిట్, డెలివరీ అయ్యాక ఆటోలో ఇంటి దగ్గర దింపుతున్నామని తెలిపారు. పేద ప్రజల కష్టాలు అర్థం చేసుకుని కష్టాలు తీరుస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. ఎండాకాలంలో కూడా హల్దీ వాగు పారుతుందంటే కేసీఆర్ కృషివల్లే సాధ్యమైందన్నారు.తాగడానికి మంచినీళ్లు లేనటువంటి ప్రాంతంలో నేడు ప్రతి ఇంటికి నీళ్లు వచ్చాయంటే కేసీఆర్ గారి కృషివల్లేనన్నారు.60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ చేయని అభివృద్ధిని ఇప్పుడు చేస్తానంటే నమ్ముతారా అని ప్రశ్నించారు. కేసీఆర్ వచ్చారు కాబట్టి రైతు విలువ, భూమి ధర పెరిగిందన్నారు.సద్ది తిన్న రేవు తలవాలని, పనిచేసిన కేసీఆర్ ను ఆశీర్వదించాలని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు.