A place where you need to follow for what happening in world cup

త్వరలోనే బీఆర్ఎస్ మేనిఫెస్టో అన్ని వర్గాలు సంతోషపడేలా శుభవార్త వింటారు రాష్ట్ర మంత్రి హరీష్ రావు

త్వరలోనే బీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నాం. అన్ని వర్గాలు సంతోషపడేలా శుభవార్త త్వరలోనే వింటారని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. బుధవారం మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో కొండా లక్ష్మణ్ బాపూజీ, శివాజీ విగ్రహాలను మంత్రి ఆవిష్కరణ చేశారు. తూప్రాన్ పట్టణం, మనోహరాబాద్ లో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా జరిగిన పలు సభల్లో మాట్లాడారు. మంచినీళ్లు పట్టుకునే ప్రతి ఆడపడచు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గుర్తుచేసుకుంటున్నదన్నారు. రెండు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్న ప్రతి అవ్వకు కేసీఆర్ పెద్ద కొడుకులాగా కనిపిస్తాడన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముభరక్ తీసుకునే ప్రతి ఆడపిల్లకు మేనమామ మన కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పొందుతున్న ప్రతి ఒక్కరికి కేసీఆర్ కనిపిస్తాడని తెలిపారు.

పేద ప్రజల సంక్షేమం కోసం అహర్నిశం పాటుపడుతున్న కేసీఆర్ ను ప్రతిపక్షాలు కావాలని తిడుతున్నాయన్నారు. మీకు తిడుతున్న ప్రతిపక్షాలు కావాలా? సంక్షేమం రూపంలో కిట్లు ఇస్తున్న కేసీఆర్ కావాలా? అని ప్రశ్నించారు. కేసీఆర్ మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు.నిజం ప్రచారం చేయకపోతే అబద్ధం రాజ్యమేలుతుందన్నారు. ప్రతిపక్షాల అబద్ధాలు తిప్పికొట్టాలంటే మీరంతా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి, అభివృద్ధి గురించి చాటి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా లాంటి మహమ్మారి వచ్చినా సంక్షేమ పథకాలను, అభివృద్ధిని ఆపని ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.

ప్రభుత్వ ఆసుపాత్రుల్లో 76 శాతం డెలివరీలు
జరుగుతున్నాయని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. మెదక్ జిల్లా మనోహరాబాదులో నూతనంగా నిర్మించిన పీహెచ్ సీని బుధవారం ప్రారంభించారు.ఉచితంగా అన్ని రకాల పరీక్షలు, వైద్య సేవలు ఇక్కడ అందుబాటులో ప్రజలకు ఉంటుందన్నారు. గర్భిణీలకు చెకప్ లు కూడా ఇక్కడ జరుగుతాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయితే కేసీఆర్ కిట్, డెలివరీ అయ్యాక ఆటోలో ఇంటి దగ్గర దింపుతున్నామని తెలిపారు. పేద ప్రజల కష్టాలు అర్థం చేసుకుని కష్టాలు తీరుస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు.

60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ చేయని అభివృద్ధిని ఇప్పుడు చేస్తానంటే నమ్ముతారా అని ప్రశ్నించారు. కేసీఆర్ వచ్చారు కాబట్టి రైతు విలువ, భూమి ధర పెరిగిందన్నారు.సద్ది తిన్న రేవు తలవాలని, పనిచేసిన కేసీఆర్ ను ఆశీర్వదించాలని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. ఈ సభలో జడ్పీ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్, ఎంపీపీ అధ్యక్షురాలు నవనీత, ఎఫ్డిసి చైర్మన్ ప్రతాపరెడ్డి, ఎలక్షన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.