- రాయికల్ మండలం జోరుగా కలప దందా…
- తూతూ మంత్రంగా అధికారుల తనిఖీలు
రాయికల్ మండలంలో కలప అక్రమ రవాణా జోరుగా సాగుతోంది.. రాయికల్ రేంజ్ పరిధిలో సుమారు 32 గ్రామాలు ఉండగా 20 వరకు అటవీ గ్రామాలు ఉన్నాయి.. ఆయా గ్రామాల శివారు అడవి నుంచి రోజు అక్రమ కలప తరలిపోతుంది.. ప్రజా ప్రతినిధులు ప్రశ్నిస్తే అడపా అధికారులు నామా మాత్రపు తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తున్నారు.. రాయికల్ మండలంలోని బోర్నపల్లి, వస్తాపూర్, చింతలూరు, జగన్నాథ్ పూర్, ధావన్ పెళ్లి, కట్కాపూర్, తాట్లవాయి, కైరిగుడెం, రాజనగర్,ఆలూరు, మూట పెళ్లి ,కొత్తపేట, వడ్డే లింగాపూర్ ,వడ్డెర కాలనీ గ్రామాల శివారులో నీ అటవీ ప్రాంతాలలో రహదాలకు కొంతమేర దూరంలోని చెట్లను నరికి తరలిస్తున్నారు.. గతంలో కొత్తపేట ,జగన్నాథ్ పూర్, తట్లావాయి లో భారీ మొత్తంలో కలపను స్వాధీనం చేసుకున్నారు..
ప్రభుత్వం ఓవైపు అటవీ పెంపు కొరకు హరితహారం పేరుతో నిధులు ఖర్చు చేసి చెట్లను పెంచుతుంటే మరోవైపు కొందరు పెరిగిన వృక్షాలను నరికివేసి సొమ్ము చేసుకుంటున్నారు.. రాత్రిపూట కోరుట్ల జగిత్యాల మెట్పల్లి తదితర ప్రాంతాలకు టేకును సరఫరా చేస్తున్నారు.. గతంలో చెక్ పోస్టులు, లైన్స్ కార్స్ సిబ్బంది తనిఖీలు చేసి కలప అక్రమ రవాణా కాకుండా ఏర్పాటు చేయగా ప్రస్తుతం లేకపోవడంతో అక్రమ కలప రవాణా జోరుగా సాగుతోంది…..అటవీ ప్రాంతాలలో అధికారులు తనిఖీలు చేసి అక్రమ కలప రవాణాలకు అడ్డుకట్ట వేయాల్సి ఉంది…గతంలో గ్రామాలలోని ప్రజలతో వన సంరక్షణ సమితిలు ఏర్పాటు చేసి అటవీరక్షణకు పాల్పడుతుండేవారు.. కాని వన సంరక్షణ సమితి ఏర్పాటు నిలచి పోవడంతో అటవీ సంరక్షణకు ఇటు గ్రామం సైతం ముగ్గు చూపడం లేదు.. అడవి రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టి వన సంరక్షణ సమితి లను మళ్ళీ ఏర్పాటు చేయాల్సి ఉంది.. అటవీరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టి కాపాడాలని మండల ప్రజలు కోరుతున్నారు.
అక్రమ కలప రవాణా చేస్తే కేసులు నమోదు..
…. టి.భుమేష్, ఎఫ్ అర్వో
అటవీ తీరా ప్రాంతాల నుంచి అక్రమంగా కలప రవాణా చేస్తే కేసులు నమోదు చేస్తాం..అట వి రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం…