కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే కట్టుబడి ఉంటాం. పార్టీ బీఫామ్ ఎవరికి ఇస్తే వారికి మండలం తరపున పూర్తి మద్దతు తెలుపుతాం. పార్టీకి అంకితభావంతో పనిచేసే నాయకులకు ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుంది. కుంభం అనిల్ కుమార్ రెడ్డి గత రెండు నెలల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదగా బిఆర్ఎస్ కండువా కప్పుకొని బిఆర్ఎస్ పార్టీలో చేరికైనట్టు అందరికీ తెలిసిందే. రెండు నెలలు గడవక ముందే యూ టర్న్ తీసుకొని సొంతగూటికి రావడం పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.గత తొమ్మిది ఏళ్లుగా పార్టీ బలోపేతం చేసేందుకు సహాయశక్తుల కృషి చేశారు. కుంభం అనిల్ కుమార్ రెడ్డి సొంతగూటికి రావడంతో కాంగ్రెస్ పార్టీలో జోస్ అందుకుంది.
స్వార్థ రాజకీయాల కోసమే సొంతగూటికి…
కాంగ్రెస్ టికెట్టు మొదటి నుంచి తనకే అని కుంభం అనుకుంటున్న సమయంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బిసి నాయకుడైన పంజాల రామాంజనేయులు గౌడ్ కు వస్తున్నట్లు ప్రకటించగా, కుంభం ఎంపీపై విమర్శలు చేస్తూ బిఆర్ఎస్ పార్టీలో చేరారు.అయితే మండలంలోని పిల్లాయిపల్లి, ఇంద్రియాల, దంతూరు, దేశ్ముఖి, శివారెడ్డి గూడెం పలు గ్రామాలలో సుమారు 400 మంది పైచిలుకు నాయకులు, కార్యకర్తలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ని నమ్మి ఆయన సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఎవరికి తెలియకుండా తన స్వార్ధ రాజకీయాల కోసమే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సొంతగూటిలో చేరడం పట్ల కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై ఘాటు విమర్శలు చేసి మళ్లీ సొంతగూటికి రావడం పట్ల పలువురు కార్యకర్తలు,పార్టీ శ్రేణులు తప్పు పడుతున్నారు. ఎన్నికలలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మద్దో తెలియక ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. కుంభం చేరికతో కాంగ్రెస్ లో గ్రూప్ తగాదాలు ఏర్పడే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.