మెదక్:మెదక్ జిల్లా నార్సింగి మండలం కాస్లాపూర్ గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కంటైనర్ లారీలు డి కొన్న ఘటనలో ఇద్దరు సజీవ దహనం అయ్యారు. రెండు లారీలు ఢీకొనడంతో ఒక లారీలో మంటలు చెలరేగాయి. ఓ కంటైనర్ లారీలో గ్యాస్ సిలిండర్ ఉండడంతో మంటలు తీవ్రంగా వ్యాపించాయి. మంటలు భారీ ఎత్తున ఎగసిపడడంతో మంటలు ఆర్పటానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు.