కాకినాడ:జనసెనాని పవన్ కళ్యాణ్ పై ముఖ్యమంత్రి వ్యక్తి గత విమర్శలు మాని, రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాల అమలుపై దృష్టి సారించాలని జనసేన కాకినాడ టౌన్ ఇన్ఛార్జ్ ముత్తా శశిధర్ పేర్కొన్నారు. కాకినాడ సిద్దార్థ నగర్ జనసేన పార్టీ కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, టౌన్ ప్రెసిడెంట్ సంగిశెట్టి అశోక్, 39వ డివిజన్ ఇన్ ఛార్జ్ ఆకుల శ్రీనివాస్ లు ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ముత్తా శశిధర్ మాట్లాడారు.దేశానికే దిక్సూచి అమ్మఒడి పథకం అంటూ బహిరంగ సభలో గొప్పలు చెప్పడం తప్ప క్షేత్రస్థాయిలో అర్హతలున్న విద్యార్దులకు అమ్మఒడి ఇవ్వడం లేదని
ఆరోపించారు.
300యూనిట్లు కరెంట్ బిల్లులు వచ్చాయంటూ పలుషాకులు చెబుతూ పిల్లలతో పాటు అమ్మలని మోసం చేస్తున్నారని, కాకినాడ జిల్లాలో 7456మంది విద్యార్దులకు అమ్మఒడి పథకం నుంచి తొలగించారని వారిపక్షన జనసేన పార్టీ అధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా విద్యార్థుల వద్ద నుంచి చెత్త సేకరణ పన్నును వసూల్ చేస్తున్నారని మండిపడ్డారు.28,000మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం హర్షణీయమని, ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఆప్షన్ త్రీ ను ఎంచుకున్న లబ్ధిదారులకు ప్రభుత్వమే నేరుగా ఇల్లులు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు..