A place where you need to follow for what happening in world cup

వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా బీజేపీ మేనిఫెస్టో..

2047 నాటికి వికసిత భారత్‌ థీమ్‌తో భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టో (సంకల్పపత్ర)ను విడుదల చేసిందని,  వొచ్చే ఐదేళ్లు యువత, మహిళలు, పేదలు, రైతుల సంక్షేమమే  ప్రధాన ఎజెండాగా పనిచేస్తామని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ సాధించిన విజయా లపై రూపొందించిన వికసిత్‌ భారత్‌ డిజిటల్‌ క్యాలండర్‌ను కిషన్‌ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ.. బిజెపి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌ షా, కేంద్ర మంత్రి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌, రాజ్‌నాథ్‌ సింగ్‌ కలిసి బిజెపి ‘సంకల్ప పత్ర’ (మేనిఫెస్టో)ను విడుదల చేశారని తెలిపారు. దేశ అభివృద్ధి కోసం, మానవ కల్యాణం కోసం బిజెపి 1980 నుంచి బిజెపి సంకల్ప పత్రను రూపొందించిందన్నారు. రానున్న రోజుల్లో దేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు. 2029 వరకు పేదలకు ఉచిత రేషన్‌ పథకం అందజేస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. పైపులైన్‌ ద్వారా ఇంటింటికీ గ్యాస్‌ అందజేయడంతో పాటు ఆయుష్మాన్‌ భారత్‌లో భాగంగా రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందించనున్నట్లు చెప్పారు.

మధ్యతరగతి కుటుంబాల్లోని వృద్ధులకు ఆయుష్మాన్‌ భారత్‌తో సేవలు అందుతా యని, ఇదొక గొప్ప నిర్ణయమని కిషన్‌ రెడ్డి కొనియాడారు. సీనియర్‌ సిటిజన్లు అందరికీ ఒక కొడుకుగా నరేంద్ర మోదీ ఆయుష్మాన్‌ భారత్‌ స్కీమ్‌తో వైద్యసాయంతో పాటు తక్కువ ధరకు ఔషధాలను అందేలా చేస్తున్నాని తెలిపారు. దేశంలో గత పదేళ్లలో 4 కోట్ల ఇండ్లు నిర్మించగా..రానున్న రోజుల్లో పేదలకు మరో 3 కోట్ల ఇళ్లు కట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. దేశంలో ఐఐటీలు, ఐఏఎంలను అగశ్రేణి విద్యాసంస్థలను వేగవంతంగా విస్తరింపజే స్తామని తెలిపారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్‌ చట్టాన్ని తీసుకొచ్చా మని, దాన్ని అమలు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దేశంలోని పోస్టాఫీసుల సంఖ్యను పెంచడంతో పాటు సోషల్‌ సెక్యూరిటీ కేంద్రా లుగా ఉపయోగిం చు కునేలా ప్రణాళిక రూపొందించిందని తెలిపారు. నీలి విప్లవం కింద మత్స్య ఉత్పత్తి, ప్రాసెసింగ్‌ కోసం సహకారం అందిస్తామని చెప్పారు. గిగ్‌ వర్కర్స్‌, ఆటో, ట్యాక్సీ కార్మికులకు చట్టబద్ధత కల్పిస్తూ ఈ-శ్రమ్‌ కార్డు కింద రిజిస్ట్రేషన్‌ చేయించి వారి కుటుంబాలకు విద్య, వైద్యం, ఇన్సూరెన్స్‌, పెన్షన్‌ సదుపాయం కల్పించేలా కొత్త పథకం తీసుకొస్తామని కిషన్‌ రెడ్డి వివరించారు.

గిరిజన మంత్రిత్వ శాఖకు మరిన్ని నిధులు
రానున్న రోజుల్లో గిరిజన మంత్రిత్వ శాఖకు మరిన్ని నిధులు పెంచి ట్రైబల్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ యాక్టివిటీని ప్రోత్సహిస్తామని, గిరిజనుల భాష, కళలు, సంస్కృతి, సంప్రదాయలను సంరక్షిస్తూ వారికి ప్రోత్సాహం అందిస్తామని కిషన్‌ రెడ్డి తెలిపారు. భారత్‌ను రానున్న రోజుల్లో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారని తెలిపారు. భారత్‌ను గ్లోబల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ముందుకు సాగుతున్నామని, రైల్వేల్లో వెయిటింగ్‌ లిస్టు లేకుండా వందే భారత్‌ ట్రైన్లతో పాటు మరిన్ని రైళ్లను నలుదిశలా విస్తరింపజేస్తామన్నారు. భారతదేశ భద్రత విషయంలో పటిష్ట చర్యలు తీసుకుంటామని, టెర్రరిజాన్ని ఉక్కుపాదంతో అణిచివేసేలా జీరో టోలరెన్స్‌ పాలసీని అమలు చేసేలా భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. దేశంలో అవినీతిపరులు ఎంతటివారినైనా వదిలే ప్రసక్తే  లేదని ప్రధాని మోదీ ప్రకటించారని గుర్తుచేశారు.

ఫార్మా, సెమీ కండక్టర్‌, ఎలక్ట్రానిక్స్‌, ఇన్నోవేషన్‌, లీగల్‌ ఇన్సూరెన్స్‌, వాహన రంగాల్లో ప్రపంచ స్థాయి హబ్‌ల ఏర్పాటు చేస్తామని, యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ అమలుతో పాటు వన్‌ నేషన్‌-వన్‌ ఎలక్షన్‌ విధానాన్ని తీసుకొచ్చేలా సంకల్ప్‌ పత్రలో హామీ ఇచ్చినట్లు చెప్పారు. ప్రాచీన కళాకండాలు, దేవాలయాలు, మ్యూజియంలు, ప్రకృతి, పర్యాటక కేంద్రాలతో పర్యాటకానికి నెలవుగా ఉన్న భారత్‌ను వరల్డ్‌ టూరిజం డెస్టినేషన్‌గా మార్చేలా తీర్చిదిద్దులని నిర్ణయించామని తెలిపారు. ఇవి ఎన్నికల హామీలు కాదని, ఇచ్చిన గ్యారంటీని అమలు చేసే దృఢ చిత్తంతో సంకల్ప్‌ పత్రను విడుదల చేశారని తెలిపారు. అయోధ్యలో రామమందిరం నిర్మిస్తామని చెప్పి హామీని నెరవేర్చామని తెలిపారు. గతంలో చెప్పినట్లుగా తెలంగాణ బిల్లుకు బిజెపి మద్దతు పలికి ఇచ్చిన మాటకు బీజేపీ నిలబడిరదని తెలిపారు. కాంగ్రెస్‌ హయాంలో ఉన్న పరిస్థితి, నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక జరిగిన అభివృద్ధి విషయంలో మల్లిఖార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ ఎవరు చర్చకు వొచ్చినా తాము సిద్ధమేనని కిషన్‌ రెడ్డి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.