డివైడర్‌ను ఢీకొట్టిన కారు…ఇద్దరు మృతి..ముగ్గురికి తీవ్ర గాయాలు
హైదరాబాద్ రాజేంద్రనగర్ ఓఆర్‌ఆర్‌పై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వొస్తున్న కారు హిమాయత్‌సాగర్ వద్ద డివైడర్‌ను ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా మరో ముగురికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా గాయపడినవారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది.మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తున్నది. ఈ ఘటనలో కారు కూడా నుజ్జునుజ్జయింది. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు.
మృతదేహాలను ఉస్మానియా దవాఖానా మార్చురీకీ, గాయపడిన వారిని శంషాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానాకు తరలించారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళితే ఆదివారం తెల్లవారుజామున శంషాబాద్ నుంచి గచ్చీబౌలీకి వెళ్లుండగా ప్రమాదం జరిగింది. కారులో ఉన్న వారందరూ యువకులే కాగా మితిమీరిన వేగం, మద్యం త్తులో ప్రమాదం జరిగిఉండవచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతి చెందిన యువకులు గౌతమ్, ఆనంద్‌లుగా గుర్తించారు. డివైడర్‌ను ఢీకొట్టినప్పు కారు 180 కిమీ వేగంతో ప్రయాణిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. డివైడర్‌ను ఢీకొట్టిన అనంతరం కారు అనేక పల్టీలు కొట్టింది.