సనాతన ధర్మంపై మంత్రి ఉదయ్ నిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు వెనుక తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఖైరతాబాద్ గణేష్ వద్ద బిజెపి ఖైరతాబాద్ నాయకుడు వల్లెపు గోవర్ధన్ ఆధ్వర్యంలో స్టాలిన్ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు ర్యాలీగా ఖైరతాబాద్ బడా గణేష్ వద్దకు బయలుదేరిన బిజెపి నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.
పోలీసులు, బిజెపి నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా గోవర్ధన్ మాట్లాడుతూ… తక్షణమే ఉదయ స్టాలిన్ హిందువులకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో హిందూ ధర్మం స్టాలిన్ కి తగ్గిన రీతిలో గుణపాఠం చెప్తుందని హెచ్చరించారు.