A place where you need to follow for what happening in world cup

కేసిఆర్ వల్లే రాష్ట్రంలో జనరంజక పాలన

  • మంచి చేసిన కేసిఆర్ కు ప్రజలు మద్దతుగా నిలవాలి
  • మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

ముఖ్యమంత్రి కేసిఆర్ జనరంజకపాలన,సంక్షేమ పథకాలు, బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై బాల్కొండ మండలం జలాల్ పూర్ , వేల్పూర్ మండలం అంక్సాపూర్ గ్రామాల నుండి కాంగ్రెస్,బీజేపీ పార్టీలకు చెందిన సుమారు 150 మంది గురువారం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి మంత్రి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్బంగా వారిని ఉద్దేశించి మాట్లాడుతూ…
అంక్సాపూర్, జలాల్ పూర్ గ్రామాల నుండి ఇంత పెద్ద ఎత్తున స్వచ్చందంగా పార్టీలో చేరి కేసిఆర్ గారికి,తనకు మద్దతు తెలిపేందుకు వచ్చినా ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు అని మంత్రి అన్నారు. ఇక నుండి మీరు బిఆర్ఎస్ కుటుంబ సభ్యులనీ మీకు ఎల్ల వేళలా అండగా ఉంటానని మంత్రి వారికి భరోసా కల్పించారు.

బాల్కొండ నియోజకవర్గ ప్రజలే నా కుటుంబ సభ్యులుగా భావించి గత 9 ఏళ్లుగా వేల కోట్లతో అభివృద్ది పనులు చేస్తున్నానని అన్నారు. ఒక్క జలాల్ పూర్ లోనే కోటి రూపాయలు రోడ్లు వేసుకున్నామని అన్నారు. నియోజకవర్గ స్థాయి కుల సంఘ భవనాలకు 100 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఇదంతా ఊరికే జరగలేదని తన తండ్రి దివంగత వేముల సురేందర్ రెడ్డి,తాను 2001 నుండి ఉద్యమ నేత కేసిఆర్ వెంట నడిచామని,మా కుటుంబం 24 సంవత్సరాల నుండి ఓకే పార్టీ, ఓకే నాయకుని కోసం పని చేశామని చెప్పారు. పార్టీ ఏ పని చెప్తే ఆ పని చేస్తామని ఉద్యమం నుండి ఇప్పటి వరకు 24 ఏళ్లలో పార్టీ అధినేత చెప్పిన ఏ పని కూడా నాతో కాదు అని అనలేదన్నారు.

కేసిఆర్ గారు చెప్పిన ఏ పని అయినా చేస్తా కాబట్టే తనపై ప్రేమ అని, ఆ ప్రేమతో నియోజకవర్గ అభివృద్ది చేసుకుంటున్న తప్పా,ఇప్పటివరకు తన సొంత పని ఏమీ చేసుకోలేదనీ తెలిపారు. నియోజక వర్గంలో 22 చెక్ డ్యాంలు, పునరుజ్జీవ పథకం,లిఫ్ట్ లు,వేల కోట్లతో రోడ్లు పలు అభివృద్ది పనులు చేసుకున్నామని కండ్ల ముందు అంతా కనిపిస్తుందని అన్నారు. నేను పడే కష్టం నా నియోజకవర్గ ప్రజల కోసమే అని ప్రజలు ఆలోచన చేయాలనీ కోరారు. నాకు ఎంత ప్రజా మద్దతు లభిస్తే అంతా ఎక్కువ ఉత్సాహంతో అభివృద్ధి చేస్తానని,నా మీద చూపించే ప్రేమ మీకు లాభమే అయితది తప్పా..ఏ మాత్రం నష్టం జరగదని మంత్రి స్పష్టం చేశారు. ఎన్నికల వేళ చాలా మంది వచ్చి చాలా రకాల మాటలు చెప్తారు కానీ మనకు అందుబాటులో ఉన్నది ఎవరు కష్ట సుఖాల్లో పాల్పంచుకున్నది ఎవరు, అభివృధ్ది చేసింది ఎవరు అనేది అలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. నేడు కేసిఆర్ వల్లే తెలంగాణ రాష్ట్రంలో జనరంజక పాలన సాగుతోందని,కేసిఆర్ గారికి తనకు ప్రజలు మద్దతుగా నిలవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.