A place where you need to follow for what happening in world cup

బతికున్నన్ని రోజులు సిరిసిల్ల ప్రజలతోనే…

0 41
  • వారెంట్ లేని కాంగ్రెస్ పార్టీ..6 గ్యారంటీలు ఇస్తదట.. ఇ
  •  కాంగ్రెస్,బిజెపిలకు ఓటు వేస్తే..ఐదేళ్లు గోసపడతారు..
  • కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. 5 ఏళ్లలో ఐదుగురు సీఎంలు మారుతారు..
  • గంభీరావుపేట ను మున్సిపాలిటీగా చేస్తా..
  • ఆగం కాకండి, ఆలోచించండి.. మరోసారి కెసిఆర్ ను ఆశీర్వదించండి..మంత్రి కేటీఆర్..

60 ఏళ్లు గా అభివృద్ధి చేయని వారెంట్ లేని కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలను ఇస్తామని తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి మోసపూరిత హామీలతో వస్తుందని, అప్పుడు చేయని అభివృద్ధి ఇప్పుడు చేస్తానంటే నమ్ముతారా అని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. గంభీరావుపేట మండల కేంద్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లును, గంభీరావుపేట -లింగన్నపేట గ్రామాల మధ్య హై లెవెల్ బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. లింగన్నపేట గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, నూతన గ్రామపంచాయతీ భవనాన్ని, కొత్తపల్లి గ్రామంలో రోడ్డు వైడింగ్ పనులకు శంకుస్థాపన, కోళ్ల మద్ది,నర్మాల గ్రామాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

గంభీరావుపేట మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో ఎక్కడలేని విధంగా గంభీరావుపేట మండల కేంద్రంలోని కేజీ టు పీజీ క్యాంపస్లో నాణ్యమైన విద్య అందుతుందని, అందులో చదివిన పిల్లలు ఇంగ్లీషులో మాట్లాడుతుంటే సంతోషంగా ఉందన్నారు. సమైక్య రాష్ట్రంలో ఏ చెరువు చూసిన ఎడారి లాగా ఉండేదని, వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మిషన్ కాకతీయ ద్వారా అన్ని చెరువులు నిండికుండలా సీఎం కేసీఆర్ మార్చాడని అన్నారు.ఎగువ మానేరుకు శాశ్వత జలకల సంచరించుకుంటుందని, మీది వైపు మల్లన్న సాగర్ నుండి కూడవెల్లి వాగు ద్వారా, ఇటువైపు మిడ్ మానేర్ నుండి మల్కపేట కు, అక్కడినుండి ఎత్తిపోతల ద్వారా ఎగువ మానేరు ను నింపుతామని, ప్యాకేజీ నైన్ పనులు పూర్తి అయ్యాయని, 365 రోజులు ఎగువ మానేరు నిండుకుండలా మారుతుందని అన్నారు.

ఎగువ మానేరుకు శ్వాసత జలకల కోసం ఇక్కడి రైతులు హైదరాబాద్ దాకా పాదయాత్రలు చేసిన,అప్పటి పాలకులు పట్టించుకోలేదని, శిలాఫలకం వేసి మర్చిపోయారని అన్నారు.దేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణ అభివృద్ధి చెందిందని అన్నారు.తెలంగాణ సర్కారు ఏర్పడిన తర్వాతే రాష్ట్రంలో అన్ని వర్గాలకు న్యాయం జరు గుతున్నదని, రైతులపైన కేసీఆర్ కన్నా అత్యంత ప్రేమ కలిగిన నాయకుడు దేశంలో ఎవరూ లేరు అని అన్నారు. వారికోసం రైతు బీమా రైతు, బంధు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, రైతుల ఖాతాలో సుమారు 73వేల కోట్ల రూపాయలను వేసిన ముఖ్యమంత్రి స్వతంత్ర భారతదేశంలోనే ఎవరు లేడు అని అన్నారు. ప్రతిపక్ష నాయకులు పనితో గెలువలేక.. ఇదివరకు ఏం చేసిండ్రో చెప్పలేక కొత్త రూపాల్లో వస్తున్నారని,మస్తు మంది వస్తారు మాయ మాటలు చెబుతారు అని అన్నారు.200 పింఛన్ ఇవ్వనోళ్లు, 4000 పింఛన్ ఇస్తానంటే ఎలా నమ్ముతామని,వారెంట్ లేని కాంగ్రెస్ పార్టీ, ఆరోగ్యారెంటీలు ఇచ్చేది లేదు, చచ్చేది లేదని ఎద్దేవ చేశారు.

60 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో రైతులకు కరెంటు ఇవ్వలేదు, పింఛన్ ఇవ్వలేదు, ఆడపిల్లల పెళ్లికి సహాయం చేయలేదు గాని, ఆరు గ్యారెంటీలు ఇస్తామని అంటున్నారని, వారిని నమ్మి ఓటు వేస్తే ఐదేళ్లు గో సపడతామని అన్నారు. కాంగ్రెస్ వాళ్లకు నమ్మి ఓటు వేస్తే కరెంటు కష్టాలు మళ్లీ మొదలవుతాయని, మహిళలు మంచినీళ్ల కోసం ఖాళీ బిందెలతో రోడ్ ఎక్కుతారని, రైతులకు సకాలంలో ఎరువులు రాక ఇబ్బంది పడవలసి వస్తుందని, ఎరువుల కోసం పోలీస్ స్టేషన్, ఫర్టిలైజర్ షాప్ ముందు చెప్పులతో క్యూ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని,అంతేకాకుండా సంవత్సరంకోసారి ఐదు సంవత్సరాల కాలంలో ఐదుగురు సీఎంలు మారతారని అన్నారు. అభివృద్ధి చేసుకున్న తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వెనుకకు నెట్టుతుందని, వైద్య విద్య వెనుకబడి పోతాయని, వారి దోపిడీ ఎక్కువ అవుతుందని అన్నారు.

గంభీరావుపేట ను తొమ్మిదేళ్ల కాలంలో అన్ని రకాలుగా అభివృద్ధి చేశామని, లింగన్న పేట – గంభిరావు పేట మధ్య హై లెవెల్ వంతెన కు శంకుస్థాపన చేశానని వచ్చే వర్షాకాలంలోగా దీనిని పూర్తి చేస్తానని అన్నారు. అంతేకాకుండా నర్మాల వద్ద మరో రెండు హై లెవెల్ వంతెన లను నిర్మిస్తానని,గతంలో మున్సిపాలిటీ గా ఉన్న గంభీరావు పేట ను తిరిగి మున్సిపాలిటీ గా చేస్తానని హామీ ఇచ్చారు సిరిసిల్లలో ఇక్కడి కాంగ్రెస్ నాయకులు కేటీఆర్ ఎక్కడ అభివృద్ధి చేయలేదని అంటున్నారని, అదే కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి నిధులన్నీ సిరిసిల్ల గజ్వేల్ సిద్దిపేటకీ తీసుకుపోయి అభివృద్ధి చేస్తున్నారని అంటున్నారని అన్నారు. వారి పార్టీలో వారికే సైక్యత లేదని వారు అధికారంలోకి వచ్చి తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చేస్తారో చెప్పాలని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో మందు, పైసలు పంచా అని ఇలా చెప్పడానికి ధైర్యం కావాలని, ఎన్నికల్లో డబ్బులు పంచుతారని అపోహ ఉందని, డబ్బులు మందు పంచకుండా పోటీ చేస్తానని, బతికినన్న రోజులు సిరిసిల్ల ప్రజలకు సేవ చేస్తానని నన్ను ఆశీర్వదించండి అని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 640 గుడిసెలు ,432 రేకుల షెడ్లు, 907 శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో నివసిస్తున్న వారికి మొదటీ ప్రాధాన్యతగా గృహలక్ష్మి మంజూరు చేస్తామని అన్నారు.మిగతా పార్టీలు ఇతర రాష్ట్రాల్లో దాచుకున్న, దోచిన పైసలు తీసుకొచ్చి పంచుతారని,తీసుకొని కారు గుర్తుకే ఓటు వేసి, మరోసారి కేసీఆర్ ను ఆశీర్వదించాలని కోరారు.

తెలంగాణకు సీఎం కేసీఆర్ శ్రీరామరక్ష అని, కార్యకర్తలు, నాయ కులు సమన్వయంతో పనిచేసి మరోసారి రాష్ట్రంలో బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. జడ్పీ చైర్మన్ అరుణ, నాప్స్ కబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, కలెక్టర్ అనురాగ్ జయంతి, అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, జిల్లా ఆర్బీఎస్ కోఆర్డినేటర్ గడ్డం నర్సయ్య, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, సర్పంచ్ కటకం శ్రీధర్ పంతులు, ఎంపిపి కరుణ, జడ్పీటీసీ విజయ, సెస్ డైరెక్టర్ నారాయణ రావు, ఏఎంసీ చైర్మన్ హనుమత్ రెడ్డి, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ రాజేందర్ , టిఆర్ఎస్ జిల్లా తోట ఆగయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.