అక్టోబర్,1 నాటికి 18 సంవత్సరాల వయస్సు పూర్తి చేసుకుంటున్న యువతను ఓటరు జాబితాలో నమోదు చేసుకునే విధంగా సహకారం అందించాలని అదనపు కలెక్టర్ యస్. తిరుపతి రావు కోరారు. బుధవారం సాయంత్రం అదనపు కలెక్టర్ ఛాంబర్ లో స్పెషల్ సమ్మరీ రివిజన్ పై పొలిటికల్ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ నూతన ఓటర్లను జాబితాలో చేపించెందుకు సెప్టెంబర్ 19 మాత్రమే చివరి తేదీ కాదని, ఇది నిరంతర ప్రక్రియ ఉంటుంది కాబట్టి ఇంకా ఎవరైనా అర్హత కలిగిన వారు మిగిలిపోతే దరఖాస్తు చేసుకునే విధంగా చూడాలని పొలిటికల్ పార్టీ ప్రతినిధులను సూచించారు. ఇప్పటి వరకు అర్హత కలిగిన ప్రతి ఒక్కరినీ ఓటరు జాబితా లో చేర్చేవిధంగా అనేక చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. వనపర్తి నియోజకవర్గంలో 21ఆగస్టు నాటికి ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితా ప్రకారం 255211 ఓటర్లు ఉన్నారని, అందులో మహిళలు 127212 ఓటర్లు కాగా పురుషులు 127995 మంది ఓటర్లు ఉన్నారు. ఇతరులు 4 నమోదు కావడం జరిగిందన్నారు.
సెప్టెంబర్ 19 వరకు ఓటరు నమోదు, మార్పు చేర్పులకు అవకాశం కల్పించగా ఫారం 6 ద్వారా 10477 దరకస్తులు, ఫారం 7 ద్వారా 5146, ఫారం 8 మార్పులు చేర్పులకు 10062 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. అన్ని దరఖాస్తుల పరిశీలన, పరిష్కారం దాదాపు పూర్తి కావచ్చయని, అక్టోబర్ 4న తుది జాబితా ప్రకటించడం జరుగుతుందన్నారు. పొలిటికల్ పార్టీ ప్రతినిధులు మాట్లాడుతూ ఇంతకు ముందు రోల్ పరిశీలకులు వచ్చినప్పుడు కొన్ని పోలింగ్ స్టేషన్లు పేర్లు మార్పు చేయమని, ప్రతి పోలింగ్ కేంద్రంలో సరైన వసతులు విద్యుత్తు, ఫ్యాన్ లు, మర్గుడొడ్లు ఉండే విధంగా కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ ను కోరారు. అదేవిధంగా నాగరాల ముంపు ప్రభావిత గ్రామం ప్రజలు 3 గ్రామాలుగా ఏర్పడ్డారు అని, వారు ఓటు వేయడానికి 7కి.మి వెళ్లాల్సి ఉన్నందున వారికి అనువైన పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు.
స్పందించిన అదనపు కలెక్టర్ అన్ని పోలింగ్ కేంద్రాల్లో కనీస మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుందని, పార్టీ ప్రతినిధులు సూచనలు ఎన్నికల కమిషన్ కు పంపిస్తామని తెలియజేశారు. ఆర్డీవో పద్మావతి, స్థానిక తహశీల్దార్ యాదగిరి, పార్టీ ప్రతినిధులు సిపియం నుండి యం.డి జబ్బార్, బి. ఆర్.ఎస్ జి. పరంజ్యోతి, యం. ఐ.యం రహిం, లోక్సత్తా గంధం నాగరాజు, సి.పి.ఐ రమేష్, బిజెపి యం.రాయన్న సాగర్, టిడిపి సయ్యద్ జమిలుల్ల, బి.ఎస్.పి నుండి ఎన్.సి. రాములు తదితరులు హాజరయ్యారు.