సూర్యాపేట జిల్లా కేంద్రంలో గల మినీ ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటుచేసిన నిమజ్జన కేంద్రాలను ఎస్పీ రాజేంద్రప్రసాద్ అధనపు ఎస్పీ నాగేశ్వరరావు బుధవారం సాయంత్రం పరిశీలించారు గణేష్ శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాలలో పోలీసు భాగస్వామ్యమై విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ సూచించారు.ఉత్సవ కమిటీలు, భక్తులు, ప్రజలు ఉత్సవాలను అందరూ కలిసిమెలిసి జరుపుకోవాలని ఇతరుల మనోభావాలకు ఇబ్బంది కలిగించవద్దన్నారు.
జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జనం కార్యక్రమానికి సంబంధించి పోలీసు సిబ్బందికి ఎస్పీ విధుల నిర్వహణపై సలహాలు సూచనలను అందజేసినారు. ఉత్సవాల నిర్వహణకు సిబ్బంది రక్షణ కల్పిస్తూ రెగ్యులేట్ మాత్రమే చేయాలని, ఉత్సవంలో భాగస్వామ్యమై ఎదురు నిర్వహించాలని సూచించారు. ఉత్సవ కమిటీలకు ఉత్సవంలో పాల్గొనే వారికి ఆటంకం కలగకుండా చూడడం మన ముఖ్య విధి అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట అదనపు ఎస్పీ నాగేశ్వరరావు డివిజన్ డిఎస్పి నాగభూషణం పట్టణ సిఐ రాజశేఖర్, CI లు, SI లు, బందోబస్తు నిర్వహణ సిబ్బంది ఉన్నారు.