నంద్యాల:మహానంది మండలం తిమ్మాపురం గ్రామ ప్రాంతాల్లో జరుగుతున్న రీ సర్వే పనులను జాయింట్ కలెక్టర్ నిశాంతి.టి పరిశీలించారు. బుధవారం మహానంది మండలంలోని తిమ్మాపురం గ్రామ రైతుల పొలాల్లో జరుగుతున్న రీసర్వే పనులను ఆమె పరిశీలించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నిశాంతి. టి రైతులతో ముచ్చటిస్తూ రీ సర్వే పనుల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. అంతకుముందు మహానంది మండలంలోని తిమ్మాపురం గ్రామంలో సర్వే నంబర్ 187, 188, 200 లలో జరుగుతున్న రీ సర్వే పనులను పరిశీలించి సర్వేయర్లకు పలు సూచనలు జారీ చేశారు. మహానంది తాసిల్దార్, డిప్యూటీ తాసిల్దార్, పిఓఎల్ఆర్ డిటి తదితరులు జాయింట్ కలెక్టర్ వెంట ఉన్నారు