A place where you need to follow for what happening in world cup

టీడీపీ లో పలువురు చేరిక

  • చంద్రబాబు పాలనతోనే అన్ని వర్గాలకు మేలు
  • కిడారి శ్రావణ్ కుమార

అరకులోయ:మండలంలోని చిన్నలబుడు పంచాయతీ హట్టగుడ గ్రామంలో  తెలుగు దేశం పార్టీ యువనేత కిల్లో శ్యామ్ ఆధ్వర్యంలో భవిష్యత్తు కు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అరకు నియోజకవర్గం ఇన్చార్జి కిడారి శ్రావణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీ హయాంలో మహిళలకు పెద్ద పీట వేశారని రక్షణ ఒక భరోసా ఉండేదని యువతి యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించారని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చేవారని, డ్వాక్రా మహిళలకు పశుపు కుంకుమ ఇచ్చేవారని అన్ని వర్గాలకు మేలు జరిగిందని అలాగే గిరిజనులకు అభివృద్ధి, సంక్షేమం వైపు నడిపించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ నాలుగు సంవత్సరాల ప్రభుత్వ పాలన లో ప్రజలకు ఎటువంటి అభివృద్ధి, సంక్షేమం లబ్ది చేకురలేదని సంక్షేమం అభివృద్ధి ను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఎద్దేవా చేశారు. డబ్బులు పంచి దాన్నే సంక్షేమం,అభివృద్ధి అంటోందని మండిపడ్డారు అరాచక పాలనను చూసి ప్రజలు విస్తుపోయారని ప్రజలందరూ సంతోషంగా ఉండాలంటే మళ్లీ చంద్రబాబు నాయుడు ను ముఖ్యమంత్రి ను చేయాలని కోరారు. తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రాగానే దీపం పథకం కింద సంవత్సరం కాలంలో అర్హత గల ప్రతి కుటుంబానికి మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తోందని, అన్నదాత పథకం కింద రైతులకు సంవత్సరానికి పెట్టుబడి సాయంగా ఇరవై వేల రూపాయలు అందిస్తుందని,అలాగే జిల్లా పరిధిలోని ఉన్న బస్సులో మహిళలకు టికెట్ లేని ప్రయాణం ఉచితంగా అందిస్తోందని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కింద నెలకు 3000 వేల రూపాయలు, అలాగే మంచి నీటి పథకం కింద ఇంటింటి కి కూలాయి కనెక్షన్లు అందిస్తోందని, మహిళలకు మహాశక్తి పథకం కింద ప్రతి కుటుంబంలో 18 ఏళ్లు నిండిన మహిళలకు స్త్రీ నిధి కింద నెలకు 1500 రూపాయలు నేరుగా వారి బ్యాంకు ఖాతా కు జమ చేస్తోందని తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఏడాది కి 15000 రూపాయలు అందిస్తుందని తెలిపారు.

అలాగే జీవో నెంబర్ 3ను తీసుకొచ్చిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు కే దక్కిందని గిరిజనుల పట్ల శ్రద్ధ,సంక్షేమం, అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడు తోనే సాధ్యమని అన్నారు. గిరిజన ప్రాంతాంలో ఎక్కడా చూసినా కనీస మౌలిక సదుపాయాలు లేక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొందని పసి కందుల మరణాలు రోజు రోజుకు పెరుగుతున్న కనీస స్పందన లేకపోవడం చాలా బాధాకరమని దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వంతెనలు లేక డోలి మోతె లో రోగులు అలాగే గర్భిణీ స్త్రీలు ఆర్తనాదాలు ఈ ప్రభుత్వానికి పట్టదా అని ప్రశ్నించారు కొన్ని సమయాల్లో హాస్పిటల్ కు చేరుకోలేక మార్గం మధ్యలోనే వారి ప్రాణాలు గాల్లో కలిసిపతుంటే కన్న తల్లి తండ్రుల వారి కడుపు కోత మనోవేదన ఎవరు తీర్చగలరని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. సమస్యల్ని గాలి కొదిలి కేవలం ప్రచార ఆర్భాటాలకు మాత్రమే ప్రభుత్వం పని చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. పంచాయతీ పరిధిలోని ఉన్న గ్రామాలకు కనీస సౌకర్యాలు సీసీ రోడ్డు, వీధి దీపాలు, డ్రైనేజీ,సానిటేషన్, మంచి నీటి, పెన్షన్ లో కోత, ఇతరత్రా కారణాల చేత రేషన్ లో కోత విధించడం సమంజసం కాదని కొంతమంది లబ్దిదారులకు పెన్షన్ , రేషన్ లు రాక వారి కుటుంబ పోషణ కష్టంగా మారిందని ఎవరికి చెప్పుకోవాలో తెలియక చాలా అవస్థలు పడుతున్నారని ఈ సందర్భంగా తెలిపారు. సర్పంచ్ లకు ఎంపీటీసీ లకు నిధులు ఇవ్వడం లేదని సరైన పాలన అందించి గ్రామ స్థాయిలో సర్పంచ్ లు ఎంపీటీసీ లు అప్పులు పాలు అవుతున్నారని పంచాయతీ పాలక వర్గాన్ని పూర్తీ గా నిర్వీర్యం చేసిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లుబాటు అయ్యిందని విమర్శించారు. అనంతరం పంచాయతీకి చెందిన పలు కుటుంబాలు అలాగే నాయకులు టీడీపీ చేరాయి అరకు నియోజకవర్గం ఇన్చార్జి కిడారి శ్రావణ్ కుమార్ సమక్షంలో వారికి పార్టీ కండువాలు కప్పి టీడీపీ లో సాదరంగా ఆహ్వానించారు. నియోజకవర్గం లో  తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కట్టుగా పనిచేసి పార్టీ పూర్వ వైభవానికి కృషి చేయాలన్నారు అధికార పార్టీ బెదిరింపులకు ఎవరు భయపడవద్ధని అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు శెట్టి బాబురావు, మాజీ ఎంపీపీ పొద్దు అమ్మన్న,బాకురీ వెంకట రమణ, కిల్లో సాయిరాం,పిట్ట గుండన్న,తుడుము సుబ్బారావు,బొరి బొరి లక్ష్మి, సివేరి ఇచ్ఛావతి,పాంగి పాండు రంగ, కార్యకర్తలు తదితరులు ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.