A place where you need to follow for what happening in world cup

ఎస్సై రాజేంద్ర చుట్టూ బిగిస్తున్న ఉచ్చు

డ్రగ్స్‌ కేసులో హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ ఎస్సై రాజేంద్ర అరెస్టైన సంగతి తెలిసిందే. పట్టుబడిన డ్రగ్స్‌లో కొంత దాచిన రాజేంద్ర 1750 గ్రాముల మెథకొలిన్‌ అమ్ముకునే యత్నం చేయగా తెలంగాణ న్యాబ్‌ పోలీసులు ఎస్సై రాజేంద్రను అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో ఎస్సై రాజేంద్రతో సంబంధం ఉన్న ఇతర అధికారులు, డ్రగ్‌పెడ్లర్లపై పోలీసు ఆరా తీస్తున్నారు. ఎస్సై రాజేంద్ర మణికొండ పరిధిలో పట్టుబడ్డాడు. అనంతరం నిందితుడిని రాయదుర్గం పోలీసులకు అప్పగించారు. దీనిపై రాయదుర్గం పీఎస్‌లో కేసు నమోదు చేశారు. పోలీసులు నిందితుడిని ఆగస్టు 26వ తేదీన అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.కాగా 2023 ఫిబ్రవరిలో మహారాష్ట్రలో జరిగిన సోదాల్లో ఎస్సై రాజేందర్‌ కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో ఓ నైజీరియన్ నుంచి భారీగా డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న 2 కిలోల మెథకొలిన్‌లో 250 గ్రాములు మాయమయ్యింది.

పట్టుబడిన డ్రగ్స్‌లో కేవలం 1750 గ్రాముల మెథకొలిన్‌ మాత్రమే కోర్టులో ప్రవేశపెట్టారు. మిస్సైన మెథకొలిన్‌పై పోలీసులు కూపీ లాగడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఎస్సై రాజేందర్‌ డ్రగ్స్ విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. అతని ఇంట్లో పోలీసులు డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. ఐతే ఈ ఆరు నెలల వ్యవధిలో రాజేందర్‌ తన వద్ద ఉన్న మత్తు పదార్ధాలను అమ్మేందుకు ఎవరెవరితో సంప్రదింపులు జరిపారనే విషయాన్ని తేల్చేందుకు అతని ఫోన్ కాల్ డేటా, వాట్సప్ చాటింగ్‌లను పరిశీలిస్తున్నారు.ఇందుకు సంబంధించి ముగ్గురు కానిస్టేబుళ్లు, ఓ ఇన్‌స్పెక్టర్‌ నుంచి పోలీస్ ఉన్నతాధికారులు కొంత సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. సాక్షాత్తు సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌కు చెందిన వ్యక్తి డ్రగ్స్ కేసులో అరెస్టు కావడంతో అధికారులు దీనిని సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న వారు, ఎస్సైకు సహకరించిన వారందరిపై కఠిన చర్యలకు పూనుకుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.