A place where you need to follow for what happening in world cup

సోనియా, రాహుల్ గాంధీతో షర్మిల మంతనాలు..

వైఎస్‌ఆర్ బిడ్డగా ప్రజల్లోనే ఉంటా.. కేసీఆర్ పతనం కోసం పనిచేస్తానంటూ తేల్చిచెప్పేశారు వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల. కేసీఆర్ సర్కారుకు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యిందంటూ ఢిల్లీలో సోనియాతో భేటీ అనంతరం కామెంట్ చేశారు షర్మిల.  తెలంగాణకు సంబంధించిన అంశాలపైనే సోనియా, రాహుల్‌తో చర్చించినట్లు చెప్పారు. తెలంగాణ ప్రజలకు మేలు చేసేందుకే తాను నిరంతరం పనిచేస్తుంటానని అన్నారు.వైసీఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే ప్రచారం నేపథ్యంలో సోనియా, రాహుల్‌తో షర్మిల సమావేశం కావడం చర్చకు కారణంగా మారింది.ఢిల్లీ వేదికగా వైఎస్ షర్మిల చేసిన హాట్ కామెంట్. కాంగ్రెస్‌లోకి వైఎస్‌ఆర్టీపీ విలీనంపై చర్చలు జరిపేందుకు ఢిల్లీ వెళ్లిన షర్మిల.. సోనియాగాంధీతో పాటు రాహుల్ గాంధీని కలిశారు. తెలంగాణ ప్రజలకు మేలు చేసే విధంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిరంతరాయంగా పని చేస్తోందని అన్నారు.

సీఎం కేసీఆర్ కు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయిందని వ్యాఖ్యానించారు. అయితే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం’తెలంగాణ ప్రజలకు మేలు చేసే విధంగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిరంతరాయంగా పని చేస్తూనే ఉంటుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది’ అని సోనియాతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు.రాజన్న రాజ్యం తెస్తానన్న నినాదంతో వైఎస్ షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించారు. ఏపీలో కాకుండా తెలంగాణలో రాజకీయం చేశారు. మొదటి నుంచి సీఎం కేసీఆర్ నే టార్గెట్ చేస్తూ వచ్చారు. కేసీఆర్ ను గద్దె దించుతామని తన ప్రసంగాల్లో చెబుతూ వచ్చే వారు. వైఎస్ జగన్ జైలులో ఉన్నప్పుడు షర్మిల రాష్ట్రమంతటా తిరిగి వైసీపీ బలోపేతం చేశారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలోనూ పాలు పంచుకున్నారు.

2019 ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం, ఆస్తి తగాదాలతో జగన్ కు, షర్మిలకు మధ్య గ్యాప్ వచ్చింది. అలా షర్మిల వైఎస్ఆర్‌టీపీ పార్టీని స్థాపించారు. పార్టీ ఏర్పాటు చేసి రాష్ట్రంలోనే ఉంటూ అన్నపై పోరాటం చేయడానికి బదులు.. తెలంగాణలో రాజకీయం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో పాదయాత్ర కూడా చేశారు. ఆ తర్వాత విజయలక్ష్మిని వైసీపీ గౌరవ అధ్యక్ష పదవి నుంచి జగన్ తొలగించడంతో.. షర్మిల ఏపీ రాష్ట్రాలపైనా ఫోకస్ పెట్టడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే.. వైఎస్ కుటుంబానికి సన్నిహితులైన కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ద్వారా షర్మిలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు జరిపింది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా వైఎస్ షర్మిల ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలియజేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ లో విలీనం కాబోతుందన్న అనుమానాలను ఆనాడే కొందరు రాజకీయవేత్తలు వ్యక్తం చేశారు.ఆ తర్వాత ఆమె టెన్ జెన్‌పధ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఈ మాటలను బట్టి చూస్తే.. ఆమె పూర్తిగా తెలంగాణ రాజకీయాల మీదే ఫోకస్ పెట్టబోతున్నట్టు స్పష్టమైంది. అంటే ఏపీకి వెళ్లే ఆలోచన లేదనేది అర్ధమైంది. కాంగ్రెస్ అధిష్టానంతో జరిగిన చర్చలు ఏం అంశాలపై జరగాయనే విషయం మాత్రం బయటకు చెప్పలేదు షర్మిల.ఇక క్లారిటీ రావాల్సిన అసలు విషయం.. పార్టీ విలీనం. కాంగ్రెస్ పార్టీలో వైఎస్‌ఆర్టీపీ విలీనం ఉంటుందా.. లేదా.. ఒకవేల విలీనం జరిగితే ఎప్పటిలోపు జరుగుతుంది. ఏ షరతుల మీద ఈ ప్రక్రియ సాగుతుందనేది ఇప్పుడు క్లారిటీ రావాల్సి ఉంది. ఇంకోవైపు తెలంగాణలో ఉంటే తాను ప్రకటించినట్టు పాలేరు నుంచి బరిలోకి దిగుతారా.. లేక ఇంకేమైనా మార్పులు ఉంటాయా అనేది ఆసక్తిగా మారింది. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీని గద్దె దింపడానికి తాను శాయశక్తుల కృషి చేస్తానని గతంలో ప్రకటించిన షర్మిల.. ఇప్పుడు కూడా ఆదే స్టాండ్‌ మీదున్నట్లుగా ఆమె మాటల్లో అర్థమవుతోంది. రాజన్న బిడ్డగా తెలంగాణ ప్రజల కోసం తాను ఎప్పుడూ పని చేస్తూ ఉంటానని మరో చెప్పడం… మొదట్నుంచి బీఆర్ఎస్‌ పార్టీనే తనకు ప్రధాన ప్రత్యర్ది అని చెప్పడం.. సోనియా, రాహుల్‌తో సమావేశం జరిగిన అనంతరం ఆమె మాట్లాడిన తీరు కూడా త్వరలోనే వైఎస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో కలిపేయడం ఖాయమని చెప్పకనే చెప్పినట్లుంది.

Leave A Reply

Your email address will not be published.