- మంథని లో బిజెపి పార్టీ విజయం సాధిస్తుంది
- హైదరాబాదులో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిసమక్షంలో బిజెపిలో చేరిన చల్లా నారాయణరెడ్డి
మంథని నియోజకవర్గంలోని పేద ప్రజలకు సేవ చేయడానికి బిజెపి పార్టీలో చేరుతున్నట్టు చల్ల నారాయణరెడ్డి తెలిపారు. ఆదివారం హైదరాబాదులో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సమక్షంలో దాదాపు 300 మందితో బీఆర్ఎస్ పార్టీ నుంచి బిజెపి పార్టీలో చేరారు. పార్టీలో చేరిన నారాయణరెడ్డి కి కార్యకర్తలకు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి బిజెపి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా నారాయణ రెడ్డి మాట్లాడుతూ మంథ నియోజక వర్గాల్లో ఈ ఎన్నికల్లో బిజెపి జెండాను ఎగురవేస్తామని, పాత కొత్త వర్గాన్ని ఒక తాటిపై తీసుకొచ్చి నియోజకవర్గంలో బిజెపి పార్టీని గెలిపిస్తామన్నారు. మంథనిలో గత కొన్ని ఏళ్లుగా రెండు పార్టీల మధ్య రాజకీయం నడుస్తుందని ఇప్పుడు ప్రజలు ప్రత్నమయం కోసం బీజేపీ వైపు చూస్తున్నారని, ఈ ఎన్నికల్లో గెలిచేది బిజెపి పార్టీ అన్నారు.