జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని వీధి వ్యాపారి దాసర మామూలు ఇవ్వలేదని కోపంతో ఓ మటన్ షాపును మూసివేయించిన సంఘటన పట్టణంలో చోటుచేసుకుంది. జమ్మికుంట పట్టణానికి చెందిన షాబుద్దీన్ అనే వ్యక్తి మటన్ షాపును నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
జమ్మికుంట మున్సిపాలిటీ లోని సానిటరీ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న బోళ్ల సదానందం అనే ఉద్యోగి దసరా పండుగ మామూలు అడిగితే ఇవ్వనందున తనపై కక్ష పెంచుకొని షాపులోని కత్తులు మటన్ కంట తదితర వస్తువులను చెత్తను తరలించే వ్యానులు వేసుకెళ్లాడని షాపు యజమాని షాబుద్దీన్ తెలిపారు. అంతేకాకుండా గతంలో కూడా ఇలాగే వ్యవహరించాడని, గతంలో 5000 రూపాయలు ఇస్తే ఒక వెయ్యి రూపాయల రసీదు ఇచ్చాడని తెలిపారు.