శ్రీకాకుళం:ఆరోగ్యవంతమైన సమాజానికి లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ సేవలు అవసరం అని పలువురు ప్రముఖ వైద్యులు పేర్కొన్నారు. ప్రపంచ వైద్యుల దినోత్సవాన్ని శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు వైద్యులను సన్మానించారు. ప్రపంచ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో విశేష వైద్య సేవలు అందిస్తున్న లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ సభ్యులు డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ కుమార్, డాక్టర్ దానేటి శ్రీధర్, డాక్టర్ గూడేన సోమేశ్వరరావు, డాక్టర్ అన్నెపు శివప్రసాద్, డాక్టర్ సీపాన దేవీ ప్రసాద్, డాక్టర్ కింతలి సోమేశ్వరరావు, డాక్టర్ మెట్ట సుజాత, డాక్టర్ పైడి సింధూర తదితర వైద్యులను క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు.
క్లబ్ నూతన అధ్యక్షులు పొన్నాడ రవికుమార్ ఆధ్వర్యంలో వీరందరిని వారి ఆసుపత్రిలోని చాంబర్లలో క్లబ్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలుసుకొని దుస్సాలువ, మెమొంటోతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఇటువంటి సమస్య ద్వారా తాము కూడా తమ వంతుగా వైద్య సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. క్లబ్ నూతన అధ్యక్షులు పొన్నాడ రవికుమార్ మాట్లాడుతూ డాక్టర్స్ డే ను పురస్కరించుకొని ఈ కార్యక్రమంలో క్లబ్ మెంటార్ నటుకుల మోహన్, జోన్ ప్రెసిడెంట్ డాక్టర్ బాడాన దేవభూషణరావు, క్లబ్ కార్యదర్శి టి గోపీ, కోశాధికారి శిల్లా మణి, సభ్యులు గుత్తు చిన్నారావు, సీపాన రమేష్ కుమార్ సునీల్, రాజు, నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు.