వినాయక స్వామి వారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు హోమాలు
సర్వ కార్యములకు అధిపతి అయిన శ్రీ వినాయక స్వామి వారికి బుధవారం సాయంత్రం సంకటహర చతుర్ధి సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు అర్చనలు చేసి హోమాలు నిర్వహించారు. తిరుపతి నగర పరిధిలో నారాయణ పురం లో ఉన్న శ్రీనివాసా క్యాస్టల్ అపార్ట్మెంట్ ఆవరణలో ఉన్న శ్రీ వినాయక స్వామి వారికి ప్రతి నెలా సంకటహర చతుర్ధి రోజున వినాయకుడు కి ప్రత్యేక పూజలు అభిషేకాలు హోమాలు అర్చనలు చేసి స్వామి వారిని విశేష పుష్పాలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ఈ పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు.
స్వామి వారికి నైవేద్యం సమర్పించి పూజలు నిర్వహించారు. కమిటీ సభ్యులు మరియు అపార్ట్మెంట్ లో ఉన్న ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఎంతో మహిమగల శ్రీ వినాయక స్వామి వారికి ప్రతి బుధవారం ఉదయం పూజలు అభిషేకాలు నిర్వహిస్తారు.
బుధవారం సాయంత్రం సంకటహర చతుర్ధి సందర్భంగా అర్చకులు శ్రీ వినాయక స్వామి వారికి మొదటి కళశం పెట్టి పూజలు చేసి అనంతరం వినాయక స్వామి వారికి పంచామృత అభిషేకం చేసి తర్వాత హోమాలు నిర్వహించారు స్వామి కి అత్యంత వైభవంగా పూజలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించడం లేదు ఆశీస్సులు అందించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.