ఖమ్మం:ఖమ్మం లో శుక్రవారం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలపై ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి స్పందించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈరోజు స్థానిక ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ వట్టి మాటలు మానుకో. కొడంగల్ ప్రజలు నీమాటలు నమ్మరు. కొడంగల్ లో మళ్ళీ గెలిచేది నేనే గుర్తుపెట్టుకో. నీచమైన రాజకీయాలు చేయడం మానుకో. రాష్ట్రంలో పట్టుమని కాంగ్రెస్ పార్టీకి 10 లేదా 12 సీట్లు వస్తయి. ఫస్ట్ నువ్వు నీ సీట్ ఎక్కడో కన్ఫామ్ చేసుకో. చిల్లర మల్లర మాటలు మాట్లాడితే ప్రజలు నమ్మరు.
ఖమ్మంలో ప్రజలు రేవంత్ ను నమ్మే పరిస్థితిలో లేదు. తెలంగాణ లో ఆంధ్ర రాజకీయాలు చెల్లవు. నువ్వు చంద్రబాబు బినామివి. నువ్వు తెలంగాణ లో ఎక్కడ నిలబడ్డ నిన్ను ఓడించడం ఖాయం. నువ్వు అంత తోపువైతే కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా, అక్కడి ప్రజలకు తెలంగాణ లాగా రైతుబందు,రైతుబీమా కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్,ఇంటింటికి మిషన్ భగీరత,అలాగే ఆసరా పెన్షన్లు, లాంటి అనేక పథకాలు ఇచ్చేలా చూడు.. అంతేకాని పీసీసీ పదవి ఉంది కదాఅని ఎలపడితే అలా మాట్లాడటమ్ సరైంది కాదన్నారు..