A place where you need to follow for what happening in world cup

పంజాగుట్ట వైఎస్సార్ విగ్రహం వద్ద నివాళులు అర్పించిన వైఎస్ షర్మిల రెడ్డి

0 71

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల శనివారం పంజాగుట్ట వైఎస్సార్ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. తరువాత ఆమె మీడియాతో మాట్లాడారు.కేసీఆర్ అవినీతి పాలన అంతం కావాలి.అందుకే సోనియా,రాహుల్ గాంధీని కలిశా.తెలంగాణలో 3800KM పాదయాత్ర చేశా.ఒక యజ్ఞంలా పాదయాత్ర సాగింది.ప్రతి చోట ప్రజలు చెప్పిన సమస్యలు సామాన్యమైనవి కావు.ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు కాలేదు.  ప్రతి మాట తుంగలో తొక్కాడు. తెలంగాణ ఖజానా దోచుకున్నారు.కేసీఅర్ పందికొక్కులా రాష్ట్ర సంపద తిన్నాడు. కేవలం కుటుంబం కోసమే రాష్ట్రం తెచ్చుకున్నట్లు ఉందని అన్నారు.

మొత్తం అమ్మేస్తున్నారు.30 వేల ఎకరాలు అమ్మేశాడు.ఎన్నికలు వచ్చాయి కాబట్టి కర్ణుడు నిద్ర లేచాడు.కేసీఅర్ పాలనకు అంతం కోసమే రాహుల్ ,సోనియా గాంధీలతో చర్చ జరిగింది.  సుదీర్ఘంగా చర్చలు జరిగాయి.  చర్చలు సానుకూలంగా జరిగాయి.త్వరలో అన్ని విషయాలు వెల్లడిస్తానని అన్నారు.కొంత మంది మా పార్టీ లీడర్లు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.   వాళ్ళ అందరికీ మీ చెల్లిగా,అక్కగా ఒక మాట చెప్తున్న.రాజకీయం అంటే వండినట్లు ,తిన్నట్లు కాదు. –  రాజకీయాలు చేయడం అంటే చిత్తశుద్ది ఉండాలి.ముందు చూపు ఉండాలి,ఓపిక ఉండాలి.   ఈ రెండేళ్లలో నాతో కలిసిన ప్రతి నాయకుడికి , కార్యకర్తకు మాట ఇస్తున్న. –  నేను నిలబడుత,మిమ్మల్ని నిలబెడునని అన్నారు.   నా పై నిందలు వేసే వాళ్ళు కూడా బాగుండాలి అని కోరుకుంటున్న. వైఎస్సార్ పేరును ఎఫ్ఐఆర్ R లో చేర్చింది సోనియా గాంధీ అని మా వాళ్ళే నన్ను ప్రశ్నించారు. వైఎస్సార్ విగ్రహం సాక్షిగా ఒక విషయం చెప్పాలి. నేను ఈ విషయం చెప్పక పోతే వైఎస్సార్ అభిమానులకు అసలు విషయం తెలియదు. ఇదే అంశం సోనియా దగ్గర ప్రస్తావనకు తెచ్చాను.

రాజీవ్ గాంధీ చనిపోయాక కూడా సిబిఐ  ఛార్జ్ షీట్ లో చేర్చారు అని చెప్పారు. ఆ బాధ ఎంటో మాకు తెలుసు అని అన్నారు. మాకు తెలిసి తెలిసి అలాంటి అవమానం మేము ఎలా చేస్తాం అన్నారు. వైఎస్సార్ పై మాకు అపార మైన గౌరవం ఉంది అన్నారు. వైఎస్సార్ కుటుంబానికి ద్రోహం ఎలా చేస్తాం అన్నారు. వైఎస్సార్ లేని లోటు మాకు ఈ రోజు కూడా తెలుస్తుంది అన్నారు. నాకు అర్థమైంది ఏమిటి అంటే..వాళ్ళు తెలియక చేసిన పొరపాటే. కాంగ్రెస్ తెలిసి చేసిన తప్పు కాదు. వైఎస్సార్ ను సోనియా , రాహుల్ అపారంగా గౌరవం ఇస్తున్నారు. నేను నిర్ధారణకు వచ్చిన తర్వాతే సోనియా తో ,రాహుల్ తో చర్చలు జరిపానని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Epaper

X