మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రధానమంత్రి మహిళల ఓట్ల కోసం చేసిన ఒక బూటకపు బిల్లు అని తెలంగాణ రాష్ట్ర మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సృజన అన్నారు. సోమవారం టౌన్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించామని చెప్పుకుంటున్న బిజెపి ప్రభుత్వం ఎన్నికల లోని భాగంగా మహిళా బిల్లుని తీసుకొచ్చామని మహిళల ఓట్ల కోసం మహిళా బిల్లు పాస్ చేయమని చెప్పుకోవడానికి వేస్తున్న ఎత్తుగడ అని అన్నారు.
గత 30 సంవత్సరాలుగా పార్లమెంట్లో ఎంపీగా ఉన్న గీత ముఖర్జీ మహిళా బిల్లు కోసం శక్తి వంచన లేకుండా పోరాడిందని ఆమె పేరు పెట్టకపోవడం చాలా విచారకాలని అన్నారు. రోజు రోజుకి నిరుద్యోగ సమస్య పెరిగిపోతుందని అంగట్లో సర్కిల్ కూడా ధరలు మండిపోతున్నాయని సామాన్యుడి బతకడం కూడా గగనమైపోతున్నా కూడా కేంద్రప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరిస్తుందని ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా మహిళా సమైక్య కార్యదర్శి దేవరం మల్లీశ్వరి, దేవరం సుజాత,ఎల్లావుల ఉమా, దేవరం లక్ష్మి ,అంజలి పాల్గొన్నారు.