- ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరిన ఆశలు
- ప్రారంభమైన ఆశవర్కర్ల నిరవధిక దీక్ష…
వైద్య ఆరోగ్యశాఖ, ప్రభుత్వం, వైద్యులు చెబుతున్న ప్రతి పనిని తూచా తప్పకుండా చేస్తున్నామని అయినప్పటికీ సరైన వేతనం లేదని వెట్టి చాకిరి చేస్తున్నామని మమ్మల్ని పట్టించుకోని ఫిక్స్డ్ వేతనం అందించాలని ఆశ వర్కర్లు డిమాండ్ చేశారు.సోమవారం పట్టణంలోని అంబేద్కర్ పార్క్ వద్ద మెట్‌పల్లి,ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాలకు చెందిన ఆశ వర్కర్లు నిరవధిక సమ్మెలో బాగంగా మొదటి రోజు దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ….తెలంగాణ రాష్ట్రంలో ఆశ వర్కర్లు సుమారు 28 వేల మంది పనిచేస్తున్నామన్నారు. ఇందులో మహిళలు, బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు ఉన్నారని. ఇప్పటివరకు ప్రభుత్వం నిర్వహించిన అనేక ట్రైనింగ్లు పొందామని.
అందులో ముఖ్యంగా రిజిస్టర్లు రాయడం,సర్వేలు చేయడం, ఆన్లైన్ పనిచేయడం, బీపీ,షుగర్,థైరాయిడ్ వంటి జబ్బులను గుర్తించి ప్రభుత్వం సప్లై చేస్తున్న మందులను ప్రజలకు అందజేస్తున్నమన్నారు.వీటితోపాటు గర్భిణీ,బాలింతలకు,చిన్నపిల్లలకు, ఇతర ప్రజలకు సేవలు అందిస్తున్నామని. డబ్ల్యు హెచ్ ఒ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ గ్లోబల్ లీడర్స్ అని ఆశ వర్కర్లకు అవార్డును కూడా ప్రకటించిందని అన్నారు.ఇన్ని పనులు నిర్వహిస్తూ పేద ప్రజలకు సేవలందిస్తున్న ఆశ వర్కర్లకు నేటికి ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేయకపోవడం వలన ఆశా వర్కర్లు అన్యాయానికి గురవుతున్నామని అన్నారు.
ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సబ్ సెంటర్స్, బస్తీ దావఖానాలలో పనిచేయాలని ఆశాలకు ప్రభుత్వం చెబుతున్నదని. ఇంత పని చేస్తున్న ఆశలకు కేవలం 9 వేల 7 వందల 50 రూపాయలు మాత్రమే పారితోషికం ప్రభుత్వం చెల్లిస్తున్నదని. ఇవి కూడా ప్రతి ఒక్కరికి చెల్లించడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 18 వేల ఫిక్స్డ్ వేతనంగా నిర్ణయించి ప్రతి ఒక్క ఆశ వర్కర్ కు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లావణ్య, తిరుమల,నీరజ,షబానా,రూప, హేమ, లత,వనిత, లావణ్య, సుమ, లత,లక్ష్మి,పద్మావతి,లయ, విజయ తదితరులు పాల్గొన్నారు.