ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ ఒక రాజకీయ పార్టీకి చెందిన మీటింగ్ లో పాల్గొన్న 106 మంది ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ సిద్దిపేట ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు 38 మంది సెర్ప్ ఉద్యోగులు 14 మంది ఏపీఎం లు,18 మంది సీసీ లు,4 వివో లుఒకరు సీఓ,ఒక్కరు సీబీ ఆడిటర్స్,అలాగే 68 మంది ఈజిఎస్ ఉద్యోగులు 4 ఏపీఏం లు,7 ఈసీ లు 38 మంది టీఏ లు, 18 మందిసీఓ లు,ఒక్కరు ఎఫ్ ఏ లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కసారిగా 106 మందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు రావడంతో జిల్లాలో సంచలనం గా మారింది..
అసలు కథ ఇది….
సిద్దిపేట పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హల్ల్లో బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సెర్ప్, ఈజిఎస్ ఉద్యోగులతో సమావేశం అయ్యాడన్న సమాచారం మేరకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడకు వెళ్లి ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న ఎన్నికల అధికారులు ఫంక్షన్ హాల్ కు వెళ్లి అక్కడ సీసీ ఫ్యూటేజ్ లను పరీశీలించారు. అక్కడ ఉన్న వాహనాలనుసీజ్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అంతే కాకుండా ఫ్లైయింగ్ స్క్యార్డు పృథ్వి ఫిర్యాదు మేరకు బిఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సు డా మాజీ చైర్మన్ రవీందర్ రెడ్డి పై అప్పటికే కేసులు నమోదు చేశారు.