-
ఏప్రిల్‌లో ఎంపీగా అనర్హత వేటుకు గురైన రాహుల్ గాంధీ
- తన అధికారిక నివాసం నుంచి ఖాళీ చేసి తల్లి వద్దకు
- నిజాముద్దీన్ ఈస్ట్ బీ2లో ఉన్న ఫ్లాట్‌కు వెళ్లాలని నిర్ణయం!
- గతంలో ఇదే ఇంట్లో ఉన్న ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కొత్త ఇంటికి మారబోతున్నట్టు తెలుస్తోంది. దక్షిణ ఢిల్లీలోని నిజాముద్దీన్ ఈస్ట్ బీ2 ప్రాంతంలోని త్రీ బెడ్రూమ్ ఫ్లాట్‌కు వెళ్లే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ ఇంట్లో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఉండేవారు. ఇప్పుడు ఇదే ఆయన నివాసం కానున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
మార్చిలో ఎంపీగా తనపై అనర్హత వేటు పడటంతో ఏప్రిల్ 22న రాహుల్ గాంధీ అధికారిక బంగ్లాను ఖాళీ చేసిన విషయం తెలిసిందే. దీంతో వేలాది మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తమ ఇల్లు ఇస్తామంటూ ఆయనకు చెప్పారు. అయితే రాహుల్ మాత్రం తన తల్లి సోనియా గాంధీ వద్ద ఉంటున్నారు. నాటి నుంచి ఇంటి కోసం వెతుకుతున్న రాహుల్.. ఇకపై నిజాముద్దీన్ ఈస్ట్‌లోని ఇంటికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
త్రీ బెడ్రూమ్ ఫ్లాట్‌లో 1991 నుంచి 1998 దాకా షీలా దీక్షిత్ ఉన్నారు. సీఎంగా, గవర్నర్‌గా పని చేసిన సమయంలో ప్రభుత్వ అధికారిక నివాసాల్లో ఉన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. 2015లో తిరిగి ఈ ఫ్లాట్‌కి వచ్చారు. చనిపోయే దాకా ఆమె అక్కడే ఉన్నారు.