గాంధీ భవన్‌లో జరిగినటువంటి పీఈసీ సమానవేశంలో వాగ్వాదం జరగడం కలకలం రేపుతోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడం చర్చనీయాంశమవుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీలో రెండు టికెట్ల విషయంలోనే ఈ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింగి. కాంగ్రెస్ తరుఫున ఎమ్మెల్యే అభ్యర్థులగా ఎన్నికల్లో నిలబడేందుకు ఆసక్తి చూపుతున్నటువంటి ఆశావాహుల నుంచి దరఖాస్తులను ఇప్పటికే స్వీకరించారు. అయితే ఈ ఆశావాహుల జాబితాను పరిశీలన చేసేందుకు పీఈసీ కమిటీ మంగళవారం రాజ్‌భవన్‌లో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశం దాదాపు మూడున్నర గంటల పాటు కొనసాగింది. అయితే ఈ సమావేశంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించినటువంటి స్థానాలపై చర్చ జరిగనట్లు సమాచారం.ఇక ఒకే కుటుంబంలో రెండు టికెట్లు ఇచ్చే అంశంపై రేవంత్ రెడ్డి, ఉత్తమ్‌ల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడం ఆందోళన కలగించింది.
ఇద్దరు అభ్యర్థుల అంశంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ ప్రతిపాదన చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టుబట్టారు. కానీ ఈ ఒకే కుటుంబంలోని ఇద్దరికి టికెట్లు ఇచ్చే విషయంలో తాను ఎటువంటి ప్రతిపాదన చేయనని చెప్పారు. ఈ వ్యవహారం అంతా కూడా హైకమాండ్ చూసుకుంటుందని చెప్పారు. తనను డిక్టేట్ చేయవద్దంటూ రేవంత్ ఉత్తమ్‌తో అన్నారు. దీనివల్ల ఉత్తమ్ ఆగ్రహంతో సమావేశం నుంచి మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. అయితే అభ్యర్థుల విషయంలో ఇప్పటికీ ఎలాంటి స్పష్టత రాకపోగా.. మళ్లీ వచ్చే నెల 2వ తేది మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.ఇక్కడ మరో విషయం ఏంటంటే కొందరు నేతలు ఉదయ్‌పూర్ తీర్మానాన్ని ఈ సమావేశంలో చర్చకు పెట్టారు. ఈ తీర్మానం ప్రకారం వన్ పర్సన్ – వన్ పోస్ట్, వన్ ఫ్యామిలీ -వన్ టికెట్ అనే విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది. అయితే ఈ తీర్మానం తమకు వర్తించదని ఉత్తమ్ ఇప్పటికే చెప్పారు. ఫ్యామిలీ మెంబర్ ఐదేళ్లుగా రాజకీయాల్లో ఉంటే ఈ తీర్మానం వర్తించదని చెబుతున్నారు. తన భార్య ఎమ్మెల్యేగా పనిచేశారని.. కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం నుంచి పనిచేస్తున్నారని అన్నారు.
ఉదయ్‌పూర్ తీర్మానం తమకు వర్తించదని… ఇద్దరికీ టికెట్ ఇవ్వాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. కానీ రేవంత్ ఈ విషయం హైకమాండ్ చూసుకుంటుందని చెప్పడంతో ఉత్తమ్ కోపంతో సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు.మరోవైపు గతం కొంత కాలంగా రేవంత్, ఉత్తమ్‌ల మధ్య విబేధాలు తలెత్తుతున్నాయి. తనపై కావాలనే కోవర్టు ముద్ర వేస్తు్న్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. రేవంత్ వర్గానికి చెందిన ఓ వ్యక్తి మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేశారని అన్నారు. ఉత్తమ్ పార్టీ వీడుతున్నారంటూ ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ అంశంపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఉత్తమ్ వీడియో కూడా రిలీజ్ చేశారు. ఇదిలా ఉండగా మహిళలకు ఎన్ని సీట్లు ఇస్తారంటూ రేణుకాచౌదరి అడిగారు. బీసీల లెక్క తేల్చాలంటు వీహెచ్ పట్టుబట్టినట్లు సమాచారం. ఇక ఏ ప్రాతిపదికన సర్వేలు చేస్తున్నారో బలరాం నాయక్ అడిగినట్లు సమాచారం.