A place where you need to follow for what happening in world cup

ప్రభుత్వ సంక్షేమ పథకాలలో అర్హులైన పేదలకే ప్రాధాన్యత ఇవ్వాలి.

  • బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు సంక్షేమ పథకాలు మంజూరు
  • చేస్తేఊరుకునే ప్రసక్తే లేదు
  • పాలకుల తీరుపై గర్జించినసిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి

తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన దళిత బంధు, బీసీ బందు, పింఛన్లు, మైనార్టీ బందు, గృహలక్ష్మి,డబల్ బెడ్ రూమ్ పథకాలను బిఆర్ఎస్ కార్యకర్తలకే ఇవ్వడం సరియైన పద్ధతి కాదని అధికారం పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు తమ వైఖరి మార్చుకోవాలని లేనియెడల రానున్న ఎన్నికల్లో శంకరగిరి మాన్యాలు పట్టడం ఖాయమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి అధికార పార్టీ నాయకుల తీరును ఎండగడుతూ ధ్వజమెత్తారు . సోమవారం సిపిఐ (ఎం) సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ముందు అర్హులైన పేదలందరికీ దళిత బంధు, బీసీ రుణాలు, గృహలక్ష్మిఇండ్లు,డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, పింఛన్లు,ఇవ్వాలనిఅధికార పార్టీ కార్యకర్తలకే ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పథకాలు మొత్తం బిఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చుకునే విధానాన్ని మార్చుకొని అర్హులైన పేద, బడుగు,బలహీన వర్గాల ప్రజలకు వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో పరిపాలించిన కాంగ్రెస్, టిడిపి పార్టీలు కొద్దిమందికైనా అర్హులకు సంక్షేమ పథకాలు ఇచ్చారని, నేడు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ మొత్తం సొంత పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వ పథకాలను ఇవ్వడం ఇంతకన్నా దారుణం ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వస్తే గ్రామంలోని అన్ని పార్టీల పెద్దలందరూ కూర్చొని అర్హులైన నిరుపేదలను గుర్తించి వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేసే వారిని, కానీ నేడుబిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బిఆర్ఎస్ పార్టీ లో ఆర్ధికంగా స్థిరపడినవారికే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు.నీజమైన లబ్ధిదారులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. పార్టీలో చేరిన వారికి మాత్రమే సంక్షేమ పథకాలను అమలు చేస్తామని అనడం అర్థం లేదన్నారు.

ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయంలో వాళ్ల ఇష్టానుసారంగా అనహర్వులకు ప్రభుత్వ పథకాలను పంచుకుంటున్నారన్నారు. అందుకే బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల పై దళితులు, బీసీలు, మైనార్టీలు, పేదలు, అందరిని కలుపుకొని ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అర్హులైన పేదలకు దక్కాల్సిన సంక్షేమ పథకాలను దొడ్డి దారిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చే హక్కు ఎవరు కల్పించాలని ప్రశ్నించారు. అధికారులు నిజమైన లబ్ధిదారులను గుర్తించినప్పటికీ అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి తలోగ్గి అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులు ఒత్తుతున్నారనిఆరోపించారు. పేదలకు సంక్షేమ పథకాలు అందకపోతే అఖిలపక్ష పార్టీలను కలుపుకొని బి ఆర్ఎస్ పార్టీ గద్దె దిగేంత ఎంతవరకు ఆందోళన,పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

కలెక్టరే కలెక్టరేట్ లోకి చొచ్చుకపోయిన సిపిఎం కార్యకర్తలు
పోలీసులకు, సిపిఎం కార్యకర్తల మధ్యతోపులాట.. తీవ్ర ఉద్రిక్తత… పలువురికి స్వల్ప గాయాలు

అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు ఇవ్వాలని నినాదాలు చేస్తూ సిపిఎం నాయకులు కార్యకర్తలు కలెక్టరేట్ లోకి చొచ్చుకు పోయేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా మెయిన్ గేటు వద్దపోలీసులకు,సిపిఎం కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాట, వాగ్వాదం జరిగింది, అనంతరం ముఖ్యమైన నాయకులను కలెక్టరేట్లోకి అనుమతించడంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ వెంకట్రావుకు సమర్పించారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరి రావు, బుర్రి శ్రీరాములు, పారేపల్లి శేఖర్రావు, మట్టి పెళ్లి సైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులుజిల్లా పెళ్లి నరసింహారావు, వేల్పుల వెంకన్న, మేకన పోయిన సైదమ్మ, దండా వెంకట్ రెడ్డి, కొప్పుల రజిత, వీరబోయిన రవి, చిన్న పంగ నరసయ్య, దేవరం వెంకటరెడ్డి, కందాల శంకర్ రెడ్డి, ఎలుగూరి గోవింద్,పల్లె వెంకటరెడ్డి, కోదమగుండ్ల నగేష్, దుర్గి బ్రహ్మం,బెల్లంకొండ సత్యనారాయణ, షేక్ యాకుబ్,వట్టెపు సైదులు, మిట్ట గడుపుల ముత్యాలు, ప్రజా సంఘాల జిల్లా నాయకులు ములకలపల్లి రాములు, కాసాని కిషోర్,ఎం రాంబాబు, కడెం లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.