దేవిపట్నం:భద్రాచలం ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు గోదావరి వరదలు పోటెత్తాయి. భద్రాచలం వద్ద ఇప్పటికే 40 అడుగులకు వరద నీరు వచ్చే చేరడంతో వచ్చిన వరద నీరుని దిగువ ప్రాంతానికి విడుదల చేశారు. దిగువకు విడుదల చేసిన వరద నీటితో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం తోడవడంతో పోలవరం ప్రాజెక్టు వద్ద భారీగా వరద నీరు వచ్చి చేరింది.
ఈ సందర్భంగా సర్పంచ్ కలుం శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ గోదావరి వరద నీటితో దేవీపట్నంలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన గండి పోచమ్మ ఆలయ గోపురాన్ని గోదావరి వరదలు తాకాయని అన్నారు.అలాగే వరదలు కారణంగా పాపికొండలు విహార యాత్రకు సంబంధించిన బోట్లను కూడా తాత్కాలికంగా అధికారులు నిలిపివేశారని అన్నారు. భక్తులు ఎవరు కూడా ఆలయ పరిసర ప్రాంతాలకు రావద్దని మనవి చేశారు.ఈ గోదావరి వరదలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఆలయ పున ప్రారంభ తేదీని పత్రిక ముఖంగా తెలియజేస్తామని ఆయన అన్నారు.