పార్వతిపురం:సాలూరు ఆర్టీసీ డిపో ను ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమల రావు సందర్శించారు. అయన వెంట మన్యం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఏ ఎస్ పి షారొన్ ఇతర అధికారులు వున్ఆనరు. ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ కు పోలీసులు ముందుగా గౌరవ వందనం చేస్తూ ఆయనకు ఆహ్వానం పలికారు.
తరువాత అయన రాష్ట్రంలో 1500 కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు టెండర్లు పిలిచామని త్వరలోనే రాష్ట్రానికి కొత్త బస్సులు రానున్నాయని తెలిపారు. సాలూరు డిపోలో పనిచేసే ఆర్టీసీ ఉద్యోగులు వారి డ్యూటీలో నైపున్యం సాధించిన కొంతమంది ఉద్యోగులకు ప్రశంస పత్రం అందజేశారు ఈ కార్యక్రమం లో ఆర్టీసీ ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు.