A place where you need to follow for what happening in world cup

తుంగతుర్తిలో రాజుకుంటున్న రాజకీయ వేడి

  • కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన కోసం ఎదురుచూస్తున్న కాంగ్రెస్ క్యాడర్ప్ర
  • చార పర్వంలో దూకుడు పెంచిన బి ఆర్ ఎస్- కసితో రగిలిపోతున్న కాంగ్రెస్తుం
  • గతుర్తి పీఠం పిడమర్తి కేనా?
  • మాజీ మంత్రి దామోదర్ రెడ్డి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి ల అండ పిడమర్తికి ఉంటుందా?
  • కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తెలిస్తే అధికార పార్టీ నుండి వలసలు ఉంటాయ అంటున్న కాంగ్రెస్ ?

తుంగతుర్తి నియోజకవర్గంలో రాజకీయ వేడి రోజురోజుకు రాజుకుంటుంది .ఒకపక్క అధికార పార్టీ అభ్యర్థి ప్రస్తుత శాసనసభ్యుడు తన ప్రచార పర్వాన్ని రోజురోజుకు వేగవంతం చేస్తున్నారు .అంతేకాక ఏకంగా మంత్రుల పర్యటనలు ఖరారు చేస్తూ ముందుకు సాగుతున్నారు .అధికార పక్షానికి దీటైన విపక్షంగా కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ ఇంకా తన అభ్యర్థి ఎవరో తేల్చనేలేదు .ఆశావహుల సంఖ్య రెండు డజన్లు దాట గా వారిలో బలమైన అభ్యర్థిని ఎంపిక చేయడానికి ఒకపక్క కాంగ్రెస్ అధిష్టానం కృషి చేస్తుండగా ఇంకోపక్క తమ తమ గాడ్ ఫాదర్ ల ద్వారా టికెట్ల కోసం మరికొంత మంది ప్రయత్నాలు చేస్తున్నారు .రాష్ట్రం నుండి జాబితా తయారీ ప్రక్రియ ఢిల్లీకి చేరింది తుంగతుర్తి ఆశావహులు చాలామంది దేశ రాజధానిలో మకాం వేశారు. అక్కడ కూడా టికెట్ల కోసం ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు .ప్రధానంగా గత రెండుసార్లు ఓడిపోయిన అద్దంకి దయాకర్ తనకున్న ఏఐసీసీ పెద్దలు సన్నిహితంతో టికెట్టు తెచ్చుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు .

అద్దంకి దయాకర్ కు ఏఐసిసి లెవెల్ లో పలుకుబడి ఉన్న అసలు పోటీ చేయాల్సిన తుంగతుర్తి నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది .బాహటంగానే ఫ్లెక్సీలతో గాంధీ భవన్ ముందు అద్దంకి టికెట్ ఇవ్వద్దని ప్రదర్శనలు చేపట్టారు. సోషల్ మీడియా వేదికగా ప్రకటనలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గానికి మాత్రమే టికెట్ ఇవ్వాలని మెజార్టీ స్థానిక కాంగ్రెస్ నాయకులు మాటగా తెలుస్తోంది .ఈ నేపథ్యంలో ఉస్మానియా ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన డాక్టర్ పిడమర్తి రవి పేరు తెరమీదకి వచ్చింది పిడమర్తి రవి .సీనియర్ నాయకుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ లోకి వచ్చారు .తుంగతుర్తి టికెట్ కోసం శ్రీనివాస్ రెడ్డి సైతం కాంగ్రెస్ అధిష్టానం పై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం .ఇదే జరిగితే తుంగతుర్తి నుండి పిడమర్తి రవి పోటీ కాయంగా తెలుస్తోంది .ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు సాగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం .ప్రధానంగా భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక లాంటి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డిలను పొంగులేటి ద్వారా పిడమర్తి కలువనున్నట్లు వారి హామీ తోటే తుంగతుర్తి అభ్యర్థిగా రానున్నట్టు తెలుస్తోంది .

ముఖ్యంగా రానున్న అసెంబ్లీ ఎన్నికలు పూర్తిస్థాయి ఆర్థిక ,సామాజిక ఎన్నికలుగా చెప్పవచ్చు గత రెండు పర్యాయాలు తమ సామాజిక వర్గానికి తుంగతుర్తి సీటు దక్కలేదన్న కసితో మాదిగ సామాజిక వర్గ నేతలు ఉన్నట్లు సమాచారం .ఈసారి ఎలాగైనా తమ సామాజిక వర్గ అభ్యర్థి ఎవరైనా గెలిపించుకోవాలని పట్టుదలతో సదరు సామాజిక వర్గ నేతలంతా ఏక మవుతున్నట్లు సమాచారం అధికార పార్టీకి మరో విధమైన తలనొప్పి రానున్నట్లు తెలుస్తోంది రెడ్డి సామాజిక వర్గం సైతం ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవాలని లోపాయగారిగా పావులు కదుపుతున్నట్టు సమాచారం .అద్దంకి దయాకర్, పిడమర్తి రవి, ప్రీతం ,ల మధ్య టికెట్ కోసం పోటీ నడుస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అధిష్టానం డాక్టర్ పిడమర్తి రవి వైపు మొగ్గు చూపవచ్చనితెలుస్తోంది .ముఖ్యంగా సెలక్షన్ కమిటీ లో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అద్దంకి సీటు దక్కనిస్తారా? అనే మాట సర్వత్ర వినిపిస్తోంది .తనను విమర్శించిన అద్దంకిపై కోమటిరెడ్డి కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది .అదేవిధంగా మరో సీనియర్ నేత దామోదర్ రెడ్డిని సైతం గతంలో అద్దంకి మీడియా వేదికగా విమర్శించారు .

ఇలాంటి పరిస్థితుల్లో ఇరువురు నాయకులు మరో వ్యక్తినీ సూచించే అవకాశాలు మెండుగా ఉన్నాయని అది పిడమర్తి రవి కావచ్చు అనే మాట వినవస్తుంది. ఏది ఏమైనా కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీ నుండి పంపిన పేరే ఖరారు అవుతుందని చెప్పడంతో ఇక ఢిల్లీలో చేసేదేమీ లేక ఆశావహులంతా తమ తమ గమ్యాలకు చేరుకున్నట్టు తెలుస్తుంది .ఏది ఏమైనా కాంగ్రెస్ శ్రేణులు నియోజకవర్గ వ్యాప్తంగా తమ అభ్యర్థి ఎవరో అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు .తమ కళ్ళ ముందు అధికార పార్టీ దూకుడు వ్యవహారం జీర్ణించుకోలేకపోతున్నారు. తమ అభ్యర్థి సైతం వస్తే తాము కూడా ప్రచార రంగంలో ముందుంటామని పలువురు సీనియర్ నాయకులు చెబుతున్నారు .ఇప్పటికే సీనియర్ కాంగ్రెస్ నాయకుడు డిసిసి అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ చేరికలకు సంబంధించి జాబితాను సిద్ధం చేసుకున్నట్టు సమాచారం .అభ్యర్థి ఖరారు అయితే కాంగ్రెస్ పార్టీ తలుపులు తెరుచుకుంటాయని అధికార పార్టీ నుండి వలసలు తమ పార్టీలోకి ఉంటాయని ఉంటాయని డిసిసి అధ్యక్షులు చెబుతున్నారు .మరోపక్క మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తమ అభ్యర్థి ఎవరైనా సరే తమ మహిళా కాంగ్రెస్ తో నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తామని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ చెబుతున్నారు .ఏది ఏమైనా కాంగ్రెస్ శ్రేణులు ఎన్నికల సమరోత్సవంతో ఉండగా అభ్యర్థి ఎవరో తేలితే మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్తామని ఘంటాపదంగా చెబుతున్నారు .మరి కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థిని మొదటి జాబితాలోనే ఖరారు చేస్తారా? లేక తుంగతుర్తి అభ్యర్థిని చిట్ట చివరగా ప్రకటిస్తారా వేచి చూడాల్సింది.

Leave A Reply

Your email address will not be published.