కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ గెలుపు కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ బీసీ సంఘం జిల్లా నాయకులు తాటికొండ సంపత్ పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని తాటికొండలో ముఖ్య నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ తుక్కుగూడలో ఇటీవల నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి లో ప్రకటించిన 6 గ్యారెంటీలను గ్రామస్థాయిలో ప్రజలకు వివరించి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఆయన వెంట ప్రతాపగిరి మల్లేశం, చుక్కం శ్రీను, యార కుమార్, ఎడమ రవి, గుమ్ముల కృష్ణమూర్తి, ఎండి అజాం, బొంగోని రాజు, మరపాక నందు, నారదాసు సాగర్, చీటూరి మహేష్, చింతపండు మహేష్, మారపాక ప్రేమ్, లాలూ రమేష్, గోషికొండ వెంకటేష్, పర్శరాం, క్రాంతి శ్రీను తదితరులు పాల్గొన్నారు.