- వినాయక మండపం వద్ద హల్ చల్
- మహిళల పట్ల అసభ్య ప్రవర్తన, దాడి
- నలుగురిపై కేసు నమోదు
- హిందు, ముస్లిం వర్గాలు రాకతో జనగామ పీఎస్ వద్ద ఉద్రిక్తం
జనగామ జిల్లా కేంద్రంలోని ఓ వినాయక మండపం వద్ద ముస్లిం యువకుల వీరంగం సృష్టించారు. హిందూ మహిళలు, యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు వారిపై దాడి చేశారు. దీంతో వారు డయల్100 కాల్ చేయడంతో పోలీసు రంగప్రవేశం చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వదిలేయడంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇరు వర్గాలు శనివారం ఉదయం జనగామ పీఎస్ చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పట్టణంలోని గుండ్ల గడ్డలో ప్రాంతంలో చవితి నాడు వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు. శుక్రవారం రాత్రి కాలనీకి చెందిన మహేశ్వరం రమాదేవి, రమేశ్ మరి కొందురు గణపతి పూజ చేసి మండపం వద్ద ఉన్నారు. అదే సమయంలో కాలనీకి చెందిన కొందరు యువకులు బైక్‌పై వచ్చి ఆ దారిలోకి వచ్చారు. వినాయకుడి మండపం వద్ద దారి లేదు.. పక్క దారి నుంచి వేళ్లాలని మహిళలు చెప్పడంతో ఆ యువకులు వారిని బైక్‌తో ఢీకొట్టారు. అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు తీవ్ర దుర్భాషలాడుతూ దాడి చేశారు.
రమాదేవి పుస్తల తాడుతెంపి బీభత్సం సృష్టించారు. మరొక మహిళ, యువతుల తండ్రిని చితక బాదారు. పక్కనే ఉన్న స్థానికులు 100 డయల్ కాల్ చేయడంతో పోలీసులు అక్కడకు చేరుకుని ముస్లిం యువకులను అదుపులోకి తీసుకొని మళ్లీ వదిలి పెట్టారు. దీంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఉదయం బాధత మహిళలు, బీజేపీ లీడర్లతో పాటు పలు గణపతి మండపాల నిర్వాహకులు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశారు. అదే సమయంలో కాలనీకి చెందిన ముస్లింలు, కొందరు లీడర్లు కూడా పీఎస్ రావడంతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాలు సంయమనం పాటించాలని సూచించి అక్కడి నుంచి వెళ్లగొట్టారు.
బాధితులకు బీజేపీ భరోసా..
ముస్లిం యువకుల దాడిలో గాయపడిన బాధితులను బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్‌రెడ్డి పరామర్శించారు. శనివారం నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మాట్లాడారు. కొందరు ముస్లిం యువకులు కావాలని పట్టణంలో మత ఘర్షణలు సృష్టించేందుకు చూస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జరిగిన ఘటనపై స్థానిక పోలీసులు నిర్లక్ష్యం చేస్తే బాధితులును సీపీ ఆఫీస్ తీసుకెళ్లి కూర్చుంటామని హెచ్చరించారు.
నలుగురిపై కేసు నమోదు…
గుండ్లగడ్డ వినాయక మండపం వద్ద జరిగిన ఘటనలో బాధితుల ఫిర్యాదు మేరకు ఫైజల్, షానవాజ్, సోఫియాన్, రమీజ్‌పై కేసు నమోదు చేసినట్టు సీఐ శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని సూచించారు. ఎవరైనా శాంతిభద్రతలకు భగంగం కలిగించేలా ప్రవర్తించి, మత ఘర్షణలకు దిగినా సహించబోమని, వారు ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.