A place where you need to follow for what happening in world cup

రుణమాఫీపై మభ్యపెట్టే యత్నం

పిఎం కిసాన్‌ ‌డేటాకు ఏడు నెలలెందుకు..?
కాలయాపనతో రైతులను మోసం చేసే కుట్ర
రుణమాఫీ మార్గదర్శకాలపై మండిపడ్డ మాజీ మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి

రుణమాఫీకి పీఎం కిసాన్‌ ‌డేటాను అనుసరించడం అంటే రుణమాఫీ లక్ష్యానికి గండికొట్టడం.. రైతాంగాన్ని వంచించడమేనని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ ‌రెడ్డి అన్నారు. హావి•లు ఇచ్చినప్పుడు లేని ఆంక్షలు .. అమలు చేసేటప్పుడు ఎందుకని ప్రశ్నించారు. ఈ ఆంక్షలు విధించడానికి ఈ ఏడు నెలల సమయం ఎందుకు తీసుకున్నట్లని అన్నారు. పంటల రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర వ్యవసాయ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలపై మాజీ మంత్రి ఫైర్‌ అయ్యారు. అవి మార్గదర్శకాలు కావు.. మభ్య పెట్టేందుకు ప్రయత్నాలు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ మార్గదర్శకాలు అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుంది అని నిరంజన్‌ ‌రెడ్డి మండిపడ్డారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఉమ్మడి రాష్ట్రంలో పడిన రైతుల రుణభారాన్ని తొలగించడం కోసం వ్యవసాయ సుస్థిరత కోసం కేసీఆర్‌ 2 ‌విడుతల రుణమాఫీ పక్రియకు శ్రీకారం చుట్టారు. రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ పథకాలకు కేసీఆర్‌ ‌సర్కార్‌ శ్రీ‌కారం చుట్టింది. మొదటి విడుతలో 35.31 లక్షల మంది రైతులకు రూ. 16,144.10 కోట్లు రుణమాఫీ చేశారు. రెండో విడుతలో 22 లక్షల 98 వేల 39 రైతులకు రూ. 13,000.51 కోట్లు రుణమాఫీ చేశారు. ఎన్నికల్లో కేసీఆర్‌ ‌ప్రభుత్వం అసలు రైతులకు రుణాలే మాఫీ చేయనట్లు కాంగ్రెస్‌ ‌పార్టీ దుష్పచ్రారం చేసింది. తాము అధికారంలోకి వస్తే ఇలా ఎన్నికలు అయిపోగానే అలా డిసెంబరు 9న రుణమాఫీ చేస్తాం అని కాంగ్రెస్‌ ‌పార్టీ తమ ఎన్నికల ప్రచారంలో రాష్ట్రంలో ఉన్న 69 లక్షలపై చిలుకు ఉన్న తెలంగాణ రైతాంగంలో ఆశలు రేపింది.

అందరి రుణాలను మాఫీ చేస్తామని ఆ రోజు బహిరంగంగా చెప్పారు. ఈ రోజు కొందరికే పరిమితం చేసేందుకు మార్గదర్శకాలు తీసుకువచ్చారు. ఈ రోజుల్లో 5 ఎకరాల వ్యవసాయదారుడు, రూ. 30 వేల జీతం చేసే ఉద్యోగి కూడా ట్యాక్స్ ‌పరిధిలోకి వస్తున్నాడు. రేషన్‌ ‌కార్డు, పీఎం డాటా వంటి తోకా తొండాలు పెట్టి కొందరినే రుణమాఫీకి పరిమితం చేస్తున్నారు. రుణమాఫీ చేశాం అన్న ప్రచారం చేసుకోవడానికి ప్రభుత్వ ప్రయత్నాలు తప్ప .. రైతాంగం బాగుండాలి .. వ్యవసాయం బాగుండాలి అన్న సంకల్సం ఈ ప్రభుత్వానికి లేదు అని నిరంజన్‌ ‌రెడ్డి ధ్వజమెత్తారు. అసలు రాష్ట్రంలో రూ.2 లక్షల రుణం పొందిన రైతులు ఎంత మంది ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి.

పీఎం కిసాన్‌ ‌డాటాను మార్గదర్శకంగా తీసుకుంటాం అని ఎన్నికల ప్రచారంలో చెప్పలేదు. అసలు దానికి సంబంధించిన షరతులే లోపభూయిష్టం అయినవి. రుణమాఫీకి పీఎం కిసాన్‌ ‌డేటాను అనుసరించడం అంటే రుణమాఫీ లక్ష్యానికి గండికొట్టడం.. రైతాంగాన్ని వంచించడమే .. హావి•లు ఇచ్చినప్పుడు లేని ఆంక్షలు .. అమలు చేసేటప్పుడు ఎందుకు..? మరి ఈ ఆంక్షలు విధించడానికి ఈ ఏడు నెలల సమయం ఎందుకు తీసుకున్నట్లు ? నాడు పరుగెత్తి రుణాలు తీసుకోండి వెంటనే రుణమాఫీ చేస్తాం అని రైతులను పరుగులు పెట్టించి నేడు చావు కబురు చల్లగా చెబుతున్నారు. తెల్లరేషన్‌ ‌కార్డు ప్రామాణికం కాదని సీఎం రేవంత్‌ ఇటీవలే ప్రకటించాడు.. సరిగ్గా నాలుగు రోజులు తిరగక ముందే నాలుక మడతేశాడు అని నిరంజన్‌ ‌రెడ్డి కోపోద్రిక్తులయ్యారు.

Leave A Reply

Your email address will not be published.