A place where you need to follow for what happening in world cup

భవిష్యత్‌ ‌తరాల కోసం మొక్కలు నాటాల్సిందే

ప్రభుత్వాలు కూలుస్తామంటే ఊరుకోవాలా?
కేంద్ర మంత్రి బండి సంజయ్‌, ‌బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏ ‌కెటిఆర్‌ల తీరుపై మండిపడ్డ మంత్రి పొన్నం

భవిష్యత్తు తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కలు నాటాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీలో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాల్లో 43 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని సూచించారు. ఈ అలవాటు అందరి జీవితంలో భాగం కావాలని కోరారు..ప్రభుత్వం మొక్కలు పంపిణీ చేస్తోంది. ఎన్ని చేసినా ప్రజల సహకారం కావాలి.

 

కాలుష్యం తగ్గి వ్యాధులు దరి చేరకుండా ఉండాలంటే అందరూ దీనిపై దృష్టి సారించాలి. ప్రతి మొక్కకూ జియో ట్యాగింగ్‌ ‌చేయాలి. ఇది ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజల కార్యక్రమంగా, సామాజిక  బాధ్యతతో వ్యవహరించాలని అన్నారు. భాజపా ఇప్పటివరకు ఎన్నో  ప్రభుత్వాలను కూల్చింది. ప్రభుత్వాన్ని కూల్చుతామంటే చూస్తూ ఊరుకోవాలా? డిసెంబర్‌ 3 ‌వరకు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకునే ఆలోచనే లేదు. ప్రభుత్వాన్ని కూల్చుతామని వి•రంటుంటే.. నిలబెట్టడానికి వారు వస్తున్నారు. మేం ధర్మం తప్పలేదు.. ప్రభుత్వ సుస్థిరత కోసమే చేరికలు. కులగణనపై మరో రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం‘ అని పొన్నం ప్రభాకర్‌ ‌తెలిపారు.   బండి సంజయ్‌, ‌కేటీఆర్‌ ‌తీరు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టే ఉందన్నారు.

బీజేపీలో చేరాలంటే రాజీనామా చేసి  పార్టీలో చేరాలన్న బండి సంజయ్‌ ‌కు కౌంటర్‌ ఇచ్చారు పొన్నం. బీజేపీ కూల్చిన ప్రభుత్వాల్లో ఎంత మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని ప్రశ్నించారు.  తమ  ప్రభుత్వాన్ని కూల్చుతామంటే..చూస్తూ ఊరుకోవాలా? అని  ప్రశ్నించారు మంత్రి  పొన్నం.  తాము  ధర్మం తప్పలేదని.. కుల గణనపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు.

డిసెంబర్‌ 3 ‌వరకు ఎమ్మెల్యేలను చేర్చుకోవాలన్న ఆలోచన తమకు లేదన్నారు.  ప్రభుత్వాన్ని కూల్చుతామని బీఆర్‌ఎస్‌ అం‌టుంటే….నిలబెట్టడానికి ఎమ్మెల్యేలు వస్తున్నారని చెప్పారు.  ప్రభుత్వ సుస్థిరత కోసమే చేరికలని అన్నారు.  ఇప్పటి వరకు బీఆర్‌ఎస్‌ ‌కు చెందిన 9 మంది ఎమ్మెల్యేలు, ఆరుగుగు ఎమ్మెల్సీలు  కాంగ్రెస్‌ ‌లో చేరిన సంగతి తెలిసింది. మరో ఐదారుగురు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌ ‌కండువా కప్పుకునేందుకు సిద్దంగా ఉన్నారని తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.