హైదారాబాద్ నగవ శివారు చందానగర్లో శనివారం తెల్లారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. హైదరాబాద్ ముంబై జాతీయ రహదారికి అనుకొని ఉన్న తపాడియాస్ మారుతిమాల్లో ఉదయం 6 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగలు అలుముకొని 5 వ అంతస్తులో ఉన్న మల్టీ ఫ్లెక్స్ సినిమా హాల్లోకి మంటలు వ్యాపించాయి.
ఇందులో ఉన్న ఐదు స్క్రీన్లలో 3 స్క్రీన్స్ పూర్తిగా అగ్నికి దగ్దం అయ్యాయి.సమాచారం అందుకుని అక్కడకు చేరుకున్న డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజన్లతో వేరే అంతస్తులోకి మంటలు వ్యాపించకుండా అదుపు చేసారు.ఘటన తెల్లవారు జామున జరగడంతో అక్కడ ఎవ్వరూ లేరు. దాంతో పెను ప్రమాదం తప్పింది. అగ్ని ప్రమాదానికి కారాణం ప్రమాదం జరిగిందా, లేదా షార్ట్ సర్క్యూట్ కారణమా అనేది ఇంకా తెలియరాలేదు.