A place where you need to follow for what happening in world cup

ఇది తెలంగాణ విజయం

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రిజర్వాయర్ల మీద సంబరాలు నిర్వహించాలని మంత్రి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. రైతన్నలతో కలిసి సంతోషాన్ని పంచుకోవాలి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పరిధిలోని నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉదండాపూర్ రిజర్వాయర్ల వద్ద వేలాది మంది రైతులతో కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. పాలమూరు కష్టాలు తీర్చిన కేసీఆర్ కు  ధన్యవాదాలు. ఇది చారిత్రాత్మక విజయం. కాళేశ్వరం పంపులను మించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పంపులు. కాళేశ్వరం పంపుల సామర్థ్యం 139 మొగావాట్లు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పంపుల సామర్థ్యం 145 మెగావాట్లు, ఒక మోటరు ఒక లక్ష 96,500 హార్స్ పవర్. రోజుకు 2 టీఎంసీల నీళ్లు ఎత్తిపోసే విధంగా పనులు జరిగాయి.

నార్లాపూర్ అంజనగిరి రిజర్వాయర్ వద్ద 145 మొగావాట్ల సామర్థ్యం గల 10 పంపులు, రిజర్వాయర్ ఆనకట్ట పొడవు 11 కిలోమీటర్లు, ఎత్తు 60 మీటర్లు, 6.5 టీఎంసీల సామర్థ్యం.త్వరలో డ్రై రన్ కు సన్నాహాలు.  నెలాఖరుకు మొదటి పంపు ప్రారంభం అవుతాయి. తెలంగాణలో అత్యంత ఎత్తయిన రిజర్వాయర్ .. 85 శాతం పనులు పూర్తి అయింది. ఏదుల వీరాంజనేయ ఆనకట్ట పొడవు 7.5 కిలోమీటర్లు, 6.55 టీఎంసీల సామర్థ్యం,  145 మెగావాట్ల సామర్థ్యం గల 10 పంపుల ఏదుల పంప్ హౌస్. 24 నెలల రికార్డు సమయంలో ఏదుల రిజర్వాయర్ నిర్మాణం. 1299 మంది ముంపు బాధితులను గుర్తించి రూ.205 కోట్ల పరిహారం అందజేసాం. 50 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది.

వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్ ఆనకట్ట పొడవు 15.23 కిలోమీటర్లు, లక్ష 39 వేల ఎకరాల ఆయకట్టు వుంది. 145 మెగావాట్ల సామర్థ్యం గల 10 పంపులతో వట్టెం పంప్ హౌస్.కరివెన కురుమూర్తి రాయ రిజర్వాయర్ సామర్థ్యం 19 టీఎంసీలు .. ఆనకట్ట పొడవు 15 కిలోమీటర్లు .. లక్ష 50 వేల ఆయకట్టు, కాలువ పొడవు 110 కిలోమీటర్లు.ఇక ఉదండాపూర్ రిజర్వాయర్ ఆనకట్ట పొడవు 15.8 కిలోమీటర్లు, 16.03 టీఎంసీల సామర్థ్యం, 9.36 లక్షల ఎకరాల ఆయకట్టు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో జిల్లా సస్యశ్యామలం. కేసీఆర్ సంకల్ప బలమే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తికి కారణమని అన్నారు. రాబోయే పదేళ్లలో పాలమూరు కోనసీమను మరిపిస్తుంది. హైదరాబాద్ నుండి అలంపూరు వరకు దారి పొడవునా పచ్చదనం పరుచుకుంటుందని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.