పీలేరు:ఈనెల 29 దేశవ్యాప్తంగా బక్రీద్ పండగ ఉందని ఈ పండుగ ముస్లిం సోదరులకు అతి పవిత్రమైనదని ఇలాంటి సమయంలో ఎలాంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా చూడాలని అన్నమయ్య జిల్లా రాయచోటి డివిజన్ డిఎస్పి మహబూబ్ బాషా తెలిపారు. స్థానిక సీఐ కార్యాలయంలో హిందూ ముస్లింసోదరుల శాంతి పరిరక్షణ కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గోవధ నిషేధం చట్టం అమలులో ఉందని ఈ విషయాన్ని గమనించాలని జంతువులను వధించే సమయంలో వీడియో తీసి వైరల్ చేయరాదని అలా చేసే వారిని జైలుకు పంపిస్తామని మహబూబ్బాషా హెచ్చరించారు సర్పంచ్ హబీబ్ భాషా మాట్లాడుతూ ప్రతి పండుగను హిందూ ముస్లింసు కలిసి జరుపు కొనుచున్నామని ప్రత్యేకించి వినాయక చవితి పండుగ వినాయక చవితి పండుగ ఊరేగింపులో ఎక్కువమంది ముస్లింలు పాల్గొంటారని తెలిపారు ఈ సమావేశంలో బిజెపి నాయకులు వి మోహన్ రెడ్డి, కే సుధాకర్ రెడ్డి, విద్యానికేతన్ సుబ్రహ్మణ్యం, ముస్లిం మత పెద్దలు న్యాయవాది షౌకత్ అలీ, రియాజుల, గడి భాష మోదిన్, సమీవుల్లా, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు పీలేరు సీఏ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆ దినం మేము మా సిబ్బంది అప్రమత్తంగా ఉంటామని తెలిపారు.